సిటీ ఓటర్ కదలిరా… మన రాజధాని… మన ఓటు.. మన హక్కును వినియోగించుకుందాం… సినీ తారల ప్రచారం…

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా సినీ తారలు ప్రచారం చేశారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ 50 శాతంలోపే నమోదైంది. అయితే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ ఈసారి సెలబ్రెటీలతో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని రూపొందించింది.

సిటీ ఓటర్ కదలిరా... మన రాజధాని... మన ఓటు.. మన హక్కును వినియోగించుకుందాం... సినీ తారల ప్రచారం...
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 01, 2020 | 6:11 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా సినీ తారలు ప్రచారం చేశారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ 50 శాతంలోపే నమోదైంది. అయితే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ ఈసారి సెలబ్రెటీలతో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని రూపొందించింది. ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలిపేలా టాలీవుడ్ హీరోలు కింగ్ నాగార్జున, విజయ్ దేవరకొండతో ఒక వీడియోను రూపొందించింది.

మన నగరం… మన భవిష్యత్… కింగ్ నాగార్జున

టాలీవుడ్ కింగ్ నాగార్జున జీహెచ్ఎంసీ ఎన్నికలపై స్పందించారు. జీహెచ్ఎంసీతో కలిసి ఓటరును చైతన్యం చేసే ప్రయత్నం చేశారు. బల్దియా రూపొందించిన ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలిపే వీడియోలో నాగ్ తన సందేశాన్ని ఇచ్చారు. ‘‘మన నగరం… మన రాజధాని… మన హైదరాబాద్… మన భవిష్యత్… మన పాలన… మన ఓటు… అన్నీ మన చేతిలోనే ఉన్నాయి.. ఓటు వేద్దాం… మన శక్తిని చూపిద్దాం… ’’ అని పవర్ ఫుల్ మెసేజ్ సిటీ ఓటరుకు ఇచ్చారు…

రౌడీ హీరో సైతం…

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ రూపొందించిన వీడియోలో ఓటర్లను విజయ్ ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. అందులో మాట్లాడుతూ…‘‘అందరికీ నమస్కారం… డిసెంబర్ 1న హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. నగర పౌరులు ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సామాజిక దూరం పాటిస్తూ.. మాస్కు ధరిస్తూ పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు వేయండి…’’ అని విజయ్ పిలుపునిచ్చారు.

విలక్షణ నటుడు…

నటుడు ప్రకాశ్ రాజ్ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని కోరారు. తన ట్విట్టర్ అకౌంట్లో ప్రత్యేకంగా ట్వీట్ పెట్టారు. ఓటు హైదరాబాదీయుల హక్కని, ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశాంతమైన నగరం కోసం హైదరాబాదీలే నిర్ణయం తీసుకోవాలని కోరారు. విభజన రాజకీయాలకు ఊతమివ్వద్దని అన్నారు.

పలువురు సెలబ్రెటీలు సైతం…

స్టార్ యాంకర్ సుమ కనకాల సైతం ఓటు చైతన్య కార్యక్రమంలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక నటుడు పోసాని మురళీ కృష్ణ సైతం నగర పౌరులు ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. దర్శకుడు శంకర్ సైతం హైదరాబాద్ ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!