Breaking News
  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.35 కోట్లు మంజూరు. పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం. 627 మంది రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించనున్న ప్రభుత్వం.
  • చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత. 11.68 కిలోల నల్ల మందు, ఐదు కిలోల సూడోఫెడ్రిన్‌ స్వాధీనం. డ్రగ్స్‌ విలువ రూ.రెండున్నర కోట్లు ఉంటుందని అంచనా. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వ్యక్తిని అరెస్ట్‌ చేసిన అధికారులు.
  • ఏపీఈఆర్సీ సభ్యులను నియమించిన ప్రభుత్వం. పి.రాజగోపాల్‌, ఠాకూర్‌ రామసింగ్‌ను సభ్యులుగా పేర్కొంటూ ఉత్తర్వులు.
  • కర్నూలు: శ్రీశైలంలో అధికారుల అత్యుత్సాహం. గోపురానికి పాగ కట్టేవారి కుటుంబ సభ్యులను అనుమతించని అధికారులు. అధికారుల తీరుపై మండిపడుతున్న భక్తులు.
  • ప్రధాని మోదీతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌థాక్రే భేటీ. సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్సీపై ప్రధానితో చర్చించాం. ఈ అంశాలపై ఇప్పటికే మా వైఖరి తెలియజేశాం-ఉద్ధవ్‌థాక్రే. సీఏఏపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల పౌరసత్వాన్ని సీఏఏ హరించదు-ఉద్ధవ్‌థాక్రే.

కాళేశ్వరానికి ‘మన్మథుడి’ ప్రశంస

Nagarjuna Praises, కాళేశ్వరానికి ‘మన్మథుడి’ ప్రశంస

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సినీ నటుడు నాగార్జున సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

‘‘నీరే మనకు జీవనాధారం. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఆల్ ది బెస్ట్. మానవ ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రతీక’’ అంటూ నాగార్జున ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, తెలంగాణ సీఎంవోలకు ఆయన ట్యాగ్ చేశారు.

Related Tags