Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

కేసీఆర్ తీరుపై రోజా షాకింగ్ కామెంట్స్!

MLA Roja Comments On Telangana CM KCR, కేసీఆర్ తీరుపై రోజా షాకింగ్ కామెంట్స్!

టీఎస్ఆర్టీసీని గవర్నమెంట్‌లో వీలనం చేయడంతో పాటుగా పలు డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మె రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీ ఉద్యోగులతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. అంతేకాక సమ్మెలో పాల్గొంటున్న కార్మికులందరూ సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని.. వారి స్థానంలో త్వరలోనే కొత్తవారిని తీసుకుంటామని అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై నగరి ఎమ్మెల్యే రోజా కాస్త ఘాటుగానే స్పందించారు.

టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవర్తించిన తీరుపై తీవ్రంగా స్పందించిన రోజా.. ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. తమ డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తున్న ఆర్టీసీ కార్మికులను సీఎం కేసీఆర్ ఎలాంటి చర్చలు జరపకుండా నిర్ధాక్షణ్యంగా ఉద్యోగాల్లో నుంచి తీసేశారని వ్యాఖ్యానించారు. కానీ ఏపీలో మాత్రం ఎలాంటి ఉద్యమం లేకుండా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించారన్నారు.  ఎన్నికల సమయంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ చెప్పారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తన మాటను నిలబెట్టుకొని.. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపారన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సమావేశంలో పాల్గొన్న రోజా తెలంగాణలో సమ్మెతో పాటు తాజా పరిణమాలపై స్పందించారు. కాగా, ఎమ్మెల్యే రోజా కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించాయి.