Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

రోజా, అలీలపై..నాగబాబు ఘాటు సెటైర్లు..వార్ మొదలైందా..?

Nagababu punches to MLA Roja And Ali, రోజా, అలీలపై..నాగబాబు ఘాటు సెటైర్లు..వార్ మొదలైందా..?

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు. ఇప్పటికే ‘జబర్దస్త్’ నుంచి గెస్ట్‌గా తప్పుకున్న ఆయన తన యూట్యూబ్ ఛానల్‌ ద్వారా మల్లెమాల సంస్థలోని పలువురిపై సంచలన కామెంట్స్ చేశారు. ‘జీ’ టీవీకి షిప్ట్ అయిన టవర్ స్టార్..అక్కడ వరుస ప్రొగ్రామ్స్‌తో దుమ్ములేపుతున్నారు.

‘లోకల్ గ్యాంగ్స్‌’ అనే షోకి మెగా బ్రదర్ జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ‘అదిరింది’ అనే కార్యక్రమానికి కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే నాగబాబు పొలిటికల్ హీట్‌ని షోస్‌కి తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది.  ‘జబర్దస్త్’ లో తనతో పాటు సహా జడ్జ్‌గా వ్యవహరించిన రోజాపై, తాజాగా జడ్జిగా ఎంట్రీ ఇచ్చిన అలీపై ఓ ప్రోమోలో ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేశాడు నాగబాబు.

‘అదిరింది’ అనే కార్యక్రమానికి సంబంధించి లేటెస్ట్‌గా ఓ ప్రోమో విడుదల చేసింది షో మేనేజ్‌మెంట్. ఆ ప్రోమోలో రంగస్థల నాటకానికి అంతా సిద్దమై ఉంటుంది. ప్రత్యేక అతిథిగా ఓ ఎమ్మెల్యే పాత్రలో మహిళ ఎంట్రీ ఇస్తుంది, ఆ తర్వాత ఫేమస్ కమెడియన్‌గా మరో వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. అయినా కానీ కార్యక్రమం స్టార్ట్ కాదు. ఈ టైంలో నాగబాబు ఎంట్రీ ఇస్తాడు. పనిలో పనిగా ‘ఎంత మంది ఉన్నామన్నది కాదురా…ఎవడున్నాడన్నది ముఖ్యం.. మొదలు పెట్టండి’ అంటూ పంచ్ డైలాగ్ వేస్తాడు. ఇది పక్కా ‘జబర్దస్త్’  షో జడ్జ్‌లపై సెటైర్ అని ప్రోమో చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది. లేటెందుకు మీరు కూడా ఆ ప్రోమోపై ఓ లుక్ వేయండి.