ఒక్క ఛాన్సే జగన్‌ను సీఎం చేసింది- నాగబాబు

Nagababu Sensational Comments on YS Jagan win in AP Elections 2019, ఒక్క ఛాన్సే జగన్‌ను సీఎం చేసింది- నాగబాబు

గత ఎన్నికల ముందు వరకు మెగా బ్రదర్ నాగబాబు సోషల్  మీడియాలో యమ యాక్టివ్‌గా ఉన్నాడు. అటు చంద్రబాబుకు, ఇటు జగన్‌కు చురకలు అంటిస్తూ..తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అయితే ఎన్నికల్లో పోటీచేసిన అన్నదమ్ములిద్దరూ ఓటమి బాట పట్టడంతో..అంతవరకూ హుషారుగా ఉన్న నాగబాబు డీలా పడి కామ్ అయిపోయాడు.

అయితే తాజాగా మళ్లీ ఆయన ఫేస్ బుక్‌ లైవ్‌లో సందడి చేశారు. నెటిజన్ల నుండి అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.  2019లో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  వైయస్ఆర్‌సీపీ ఘనవిజయం సాధించడం.. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ భవితవ్యంపై నాగబాబు తనదైనశైలిలో స్పందించారు. జగన్‌ గతంలో సీఎంగా పనిచేసి ఉంటే ఆయన చేసిన పనులు చూసి ఓటర్లు, ఓట్లు వేశారని అనుకోవచ్చు… కానీ ప్రస్తుతం ఒక ఛాన్స్ ఇచ్చిచూద్దాం అనే సానూభూతితో ప్రజలు ఓట్లు వేశారన్నారు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత కూడా జగన్‌కి బాగా కలిసి వచ్చిందన్నారు.

మరోవైపు ఈవీఎం టాంపరింగ్ మీద అడిగిన ప్రశ్నకు సమాధానంగా 10 శాతం ట్యాంపరింగ్ చేసినా ఫలితాల్లో చాలా తేడాలు వస్తాయన్నారు. అయితే ట్యాంపరింగ్ జరిగిందన్న విషయాన్ని లైట్‌గా తీసుకోలేమని చెప్పారు. ఐనా తాను ఇంకాస్త ఎక్కువ ప్రచారం చేసివుంటే నర్సాపురంలో ఫలితం వేరుగా ఉండేదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రజలు జగన్ కు ఛాన్స్ ఇచ్చారని… 2024 లో కచ్చితంగా పవన్ ను సీఎం చేస్తారంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇక జగన్ పాలనను ప్రస్తావిస్తూ కొత్తగా ప్రభుత్వం ఏర్పటైంది కాస్త టైం ఇచ్చి.. ప్రజల నమ్మకాన్ని జగన్ ఎంతమేర నిలబెడతారో చూద్దాం అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *