Breaking News
  • విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.3,500 కోట్ల భారం పడుతుంది. వైసీపీ చేతగాని తనంతోనే ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి దేవినేని ఉమ. ఐదు నెలలు ఇసుక దొరకకుండా దోచుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విజయవాడ: భవానీ దీక్ష విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నెల 18 నుంచి 22 వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు. కనకదుర్గానగర్‌ మీదుగా భక్తులను ఆహ్వానిస్తున్నాం. భవానీల కోసం ఘాట్‌ రోడ్డు మీదుగా క్యూలైన్‌లు ఏర్పాటు చేశాం. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించాం-ఈవో సురేష్‌ బాబు.
  • చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికలకు రజినీ మక్కల్‌ మండ్రం దూరం. ఏ పార్టీకి మద్దతు ప్రకటించని మండ్రం. రజినీ మద్దతు ఇస్తున్నట్టు ఎవరైనా ప్రచారం చేసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
  • నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది-కోటంరెడ్డి . ప్రజలపై ఏ భారం వేయబోము అని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ఏటా రూ.700 కోట్ల భారం ప్రజలపై పడింది. మాట తప్పని జగన్‌ ఆర్టీసీ చార్జీల పెంపుపై సమాధానం చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాపీ కొడుతూ జగన్‌ కాపీ సీఎంగా మారారు -నూడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.
  • భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
  • తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర అగ్నిప్రమాదం. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ పోటులో మంటలు. మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది.
  • అమరావతి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. వాడీవేడిగా జరగనున్న సమావేశాలు. ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదలపై.. రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనున్న టీడీపీ. ఉల్లి ధరల పెరుగుదలపై టీడీపీ నిరసన. అసెంబ్లీ గేట్‌ నుంచి ఉల్లిపాయల దండలతో.. అసెంబ్లీకి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

జబర్దస్త్ వదిలేయడానికి కారణం ఇదే..!

Here Is The Reason Why Nagababu Quit Jabardasth Show, జబర్దస్త్ వదిలేయడానికి కారణం ఇదే..!

వారానికి రెండు రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్న షోస్ ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’. దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఈ రెండు ప్రోగ్రామ్స్ అభిమానుల నుంచి విశేష ఆదరణ పొందుతూ హయ్యస్ట్ టీఆర్పీతో దూసుకుపోతున్నాయి. ఇక ఈ షోల గురించి కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. టీమ్ లీడర్లతో పాటుగా ఈ షోలకు విపరీతమైన క్రేజ్ రావడంలో న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించిన నాగబాబు కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఆయన ‘జబర్దస్త్’ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. టాలీవుడ్‌తో పాటుగా నెట్టింట్లో కూడా ఈ విషయంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న తరుణంలో నాగబాబు స్వయంగా దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.

2013 ఫిబ్రవరి నుంచి 2019 ఈరోజు వరకు జబర్దస్త్‌తో తనకు ఎమోషనల్, హ్యాపీ జర్నీ కొనసాగిందని నాగబాబు అన్నారు. తాను జబర్దస్త్ మానేయడానికి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. అందుకనే స్వయంగా దీనిపై క్లారిటీ ఇవ్వడానికి ముందుకు వచ్చానన్నారు. జబర్దస్త్ గురించి తానెప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడింది లేదని.. ఎల్లప్పుడూ ఈ షోకు పూర్తి సపోర్ట్‌నే అందించానని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇలా ఆయన షో నుంచి వైదొలగడానికి గల కారణాల గురించి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..