ఆ నారాయణాస్త్రమే.. ఈ అశ్వద్ధాముడు.. ఆకట్టుకుంటోన్న టీజర్

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తోన్న తాజా చిత్రం అశ్వద్ధామ. కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నాగ శౌర్య కథ అందించడం విశేషం. ఇక ఇందులో శౌర్య సరసన మెహ్రీన్ నటిస్తుండగా.. ఐరా క్రియేషన్స్ నిర్మించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుండగా.. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ నటి సమంత ఈ టీజర్‌ను విడుదల చేయడం విశేషం. ఇక ఆద్యంతం థ్రిల్లర్‌గా వచ్చిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటుండగా.. […]

ఆ నారాయణాస్త్రమే.. ఈ అశ్వద్ధాముడు.. ఆకట్టుకుంటోన్న టీజర్
Follow us

| Edited By:

Updated on: Dec 27, 2019 | 12:15 PM

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తోన్న తాజా చిత్రం అశ్వద్ధామ. కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నాగ శౌర్య కథ అందించడం విశేషం. ఇక ఇందులో శౌర్య సరసన మెహ్రీన్ నటిస్తుండగా.. ఐరా క్రియేషన్స్ నిర్మించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుండగా.. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ నటి సమంత ఈ టీజర్‌ను విడుదల చేయడం విశేషం. ఇక ఆద్యంతం థ్రిల్లర్‌గా వచ్చిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటుండగా.. సినిమాపై అంచనాలను పెంచింది. ఈ మూవీలో నాగ శౌర్య కొత్త లుక్‌లో అదరగొట్టాడు. అలాగే టీజర్‌కు శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం మెయిన్ అస్సెట్‌గా నిలిచింది. వచ్చే ఏడాది జనవరి 31న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ ఏడాది ఒక్క చిత్రంతో కూడా నాగశౌర్య ప్రేక్షకులను పలకరించలేదు(ఓబేబిలో నటించినప్పటికీ అది చిన్న పాత్ర). ఈ నేపథ్యంలో అశ్వద్ధామపై చాలా అంచనాలను పెట్టుకున్నాడు ఈ హీరో.