అమెజాన్ నిర్మాతల మండలిని లైట్ తీసుకుందా..’మజిలీ’ రిలీజ్‌పై ఎందుకీ రాద్దాంతం

ఈ మధ్యకాలంలో సినిమావాళ్లకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే కలిసి వస్తుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ వచ్చాక.. మూవీ ఒకవైపు  థియోటర్స్‌లో నడుస్తోన్నా కూడా మరోవైపు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైతున్నాయి. ఒక రకంగా డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు డబ్బలు వస్తున్నా.. డిస్ట్రిబ్యూటర్స్‌కు మాత్రం  సినిమా నడుస్తుండగా ‘అమెజాన్’ ప్రైమ్‌లో విడుదల కావడం  నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఈ సంక్రాంతికి సూపర్ హిట్‌గా నిలిచిన వెంకటేష్,వరుణ్ […]

అమెజాన్ నిర్మాతల మండలిని లైట్ తీసుకుందా..'మజిలీ' రిలీజ్‌పై ఎందుకీ రాద్దాంతం
Follow us

|

Updated on: May 06, 2019 | 3:56 PM

ఈ మధ్యకాలంలో సినిమావాళ్లకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే కలిసి వస్తుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ వచ్చాక.. మూవీ ఒకవైపు  థియోటర్స్‌లో నడుస్తోన్నా కూడా మరోవైపు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైతున్నాయి. ఒక రకంగా డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు డబ్బలు వస్తున్నా.. డిస్ట్రిబ్యూటర్స్‌కు మాత్రం  సినిమా నడుస్తుండగా ‘అమెజాన్’ ప్రైమ్‌లో విడుదల కావడం  నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఈ సంక్రాంతికి సూపర్ హిట్‌గా నిలిచిన వెంకటేష్,వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్2’ థియేటర్స్‌లో నడుస్తుండగానే అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. దీంతో ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్‌కు రావాల్సిన లాభంలో  కోత పడిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి ఈ విషయంపై సమాలోచనలు చేసి కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేది నుంచి అమెజాన్ ప్రైమ్‌ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ సంస్థలతో పాటు శాటిలైట్ ఛానెల్స్‌కు 60 రోజుల తర్వాతే కొత్త సినిమాలను ప్రసారం చేసే విధంగా టాలీవుడ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఎవరికి నష్టం చేయదని ఇండష్ట్రీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

ఈ నిర్ణయం తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవ్వనున్న మొదటి సినిమా ‘మజిలీ’. ఉగాది కానుకగా విడులైన ఈ సినిమా నిర్మాతల మండలి నియమం ప్రకారం అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 4వ తేదిని ప్రసారం కావాల్సింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వాళ్లు వారి నిర్ణయాన్ని పట్టించుకోకుకండా ఈ సినిమా మే 10వ తేదిన అమెజాన్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే సరిగ్గా 35 రోజులకు టెలికాస్ట్ చేసినట్టు అవుతుంది. మే 10న ‘మజిలీ’ అమెజాన్ ప్రైమ్‌ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తే ..ఇప్పటికే మంచి కలెక్షన్స్‌తో థియేటర్స్‌లో రన్ అవుతున్న ‘మజిలీ’ సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా రూ.50 కోట్ల షేర్‌ను రాబట్టి ఔరా అనిపించింది. ఓవరాల్‌గా రూ.100 గ్రాస్‌ కలెక్ట్ చేసే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. పైగా మహేష్‌ బాబు మహర్షి తప్పితే దగ్గర్లో పెద్ద సినిమాలు ఏవీ లేవు. ఐతే.. నిర్మాత మండలి ఏప్రిల్ 1న ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ‘మజిలీ’ సినిమా రిలీజైంది ఏప్రిల్ 5న కాబట్టి. ఒకవేళ షూటింగ్ మొదలుపెట్టే సమయానికే జరిగిన ఒప్పందం కాబట్టి మజిలి ఆ వింగ్ లోకి రాదా లేక అమెజాన్ తన పద్ధతిలో రాజీ ఉండదని చెప్పాలనుకుందా ఇంకా క్లారిటీ లేదు