శేఖర్ కమ్ముల డైరక్షన్‌లో అక్కినేని వారి ‘ఫిదా’

Naga Chaitanya and Sekhar Kammula movie to start from September, శేఖర్ కమ్ముల డైరక్షన్‌లో అక్కినేని వారి ‘ఫిదా’

నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల ఓ చిత్రాన్ని రూపొందించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి జూన్‌లోనే పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అంతేకాదు జూలై లేదా ఆగష్టులో ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నామని అప్పట్లో చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వలన ఇంతవరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం వచ్చే నెల 5 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఇక రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చైతూ సరసన సాయి పల్లవి మొదటిసారిగా జత కట్టబోతుంది. అలాగే ఇందులో చైతూ పూర్తి స్థాయి తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నట్లు సమాచారం. నారాయణదాస్ నారంగ్, రామ్‌ మోహన్ రావు సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబోగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *