బాలయ్యకు110 మార్కులేసిన ‘మహానటి’ దర్శకుడు

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజకీయ విశేషాలతో తెరకెక్కిన చిత్రం ‘మహానాయకుడు’. ఇవాళ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా.. ప్రీమియర్ చూసిన పలువురు ప్రముఖులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ‘‘బాబు మామూలోడు కాదు. రానా నీ కిరీటంలోకి మరో కలుకితురాయి చేరింది. బాలయ్య గారు మీకు నూటికి 110 మార్కులు. పాత ఎన్టీఆర్‌గా మీరు అద్భుతంగా నటించారు. విద్యాబాలన్ […]

బాలయ్యకు110 మార్కులేసిన ‘మహానటి’ దర్శకుడు
Follow us

| Edited By:

Updated on: Feb 22, 2019 | 11:47 AM

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజకీయ విశేషాలతో తెరకెక్కిన చిత్రం ‘మహానాయకుడు’. ఇవాళ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా.. ప్రీమియర్ చూసిన పలువురు ప్రముఖులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.

‘‘బాబు మామూలోడు కాదు. రానా నీ కిరీటంలోకి మరో కలుకితురాయి చేరింది. బాలయ్య గారు మీకు నూటికి 110 మార్కులు. పాత ఎన్టీఆర్‌గా మీరు అద్భుతంగా నటించారు. విద్యాబాలన్ గారు.. సినిమాపై మీకు ఉన్న ప్రేమ చిత్రానికి మరో ఆస్తి’’ అంటూ రాసుకొచ్చారు. కాగా ఈ చిత్ర మొదటి భాగం ఘోర పరాజయం అవ్వగా.. రెండో భాగంపై చాలా ఆశలే పెట్టుకుంది చిత్ర యూనిట్.