అది వరలక్ష్మి పర్సనల్ విషయం- విశాల్

, అది వరలక్ష్మి పర్సనల్ విషయం- విశాల్

చెన్నై: తనపై నటి వరలక్ష్మి శరత్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్నారు హీరో విశాల్. గత నడిగర్ సంఘం ఎలక్షన్స్‌లో విశాల్, శరత్ కుమార్ పోటీ పడిన విషయం తెలిసిందే. అప్పట్లో వీరిద్దరూ ఒకరిపై, ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో విశాల్ గెలవడంతో గొడవ సద్దుమణిగింది. తాజాగా జరుగుతోన్న నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్‌కుమార్‌ పోటీ చేయని విషయం తెలిసిందే.

అయినా కూడా  శరత్‌కుమార్‌ను ఘాటుగా విమర్శిస్తూ ఓ వీడియో విడుదల చేశారు విశాల్‌. దీనిపై ఆయన కుమార్తె, నటి వరలక్ష్మి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తన తండ్రి ఈ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ఆయనపై ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు..? అంటూ విశాల్‌కు ప్రశ్నలను ఎక్కుపెట్టింది. విశాల్‌పై ఉన్న నమ్మకం ఈ వీడియోతో పోయిందని, ఇప్పటికే చాలా దిగజారిపోయిన అతడు నా ఓటును కూడా కోల్పోయాడని పేర్కొంది.

వాస్తవానికి  వీరిద్దరూ గతంలో  లవ్‌లో ఉన్నారని కోలీవుడ్‌లో వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్లుగానే ఈ జంట పలు వేదికల్లో సందడి చేశారు. అప్పట్లో విశాల్‌ తన తండ్రిపై విమర్శలు చేసినా ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్నట్లుండి ఇలా మాట్లాడటం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఇటీవల విశాల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా వరలక్ష్మి వ్యాఖ్యలపై విశాల్‌ స్పందించారు. అది ఆమె పర్సనల్ విషయం అన్న  హీరో.. ఆమెకు మాట్లాడే హక్కు ఉందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *