Breaking News
  • నెల్లూరు: సైదాపురం తహశీల్దార్‌ చంద్రశేఖర్‌ సస్పెన్షన్‌. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో చంద్రశేఖర్‌తో పాటు.. వీఆర్‌వోతో, తహశీల్దార్‌ ఆఫీస్‌ ఉద్యోగిని సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌.
  • టీవీ9కు అవార్డుల పంట. ఎక్సేంజ్‌ ఫర్‌ మీడియా న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అవార్డుల్లో.. టీవీ9కు మూడు అవార్డులు. పుల్వామా దాడి కవరేజ్‌కు బెస్ట్ న్యూస్ కవరేజ్ అవార్డు అందుకున్న.. విజయవాడ బ్యూరో చీఫ్‌ హసీనా. మరో రెండు విభాగాల్లో టీవీ9కు అవార్డులు. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ కార్యక్రమానికి.. సౌత్‌ ఇండియాలోనే బెస్ట్‌ యాంకర్‌గా రజినీకాంత్‌కు అవార్డు. టీవీ9 టాస్క్‌ఫోర్స్‌ బ్లాక్‌మ్యాజిక్‌ కార్యక్రమానికి మరో అవార్డు. అద్రాస్‌పల్లిలోని 'చితిపై మరో చితి' బాణామతి కథనానికి.. బెస్ట్‌ లేట్‌ ప్రైమ్‌టైం షో అవార్డు.
  • కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన కేంద్రం. స్థానికుల ప్రయోజనాలను కాపాడుతామని హామీ. త్వరలో ప్రత్యేక హోదా స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తాం -కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌.
  • రామానాయుడు స్టూడియోలో ప్రెషర్‌ కుక్కర్‌ సినిమా చూసిన కేటీఆర్‌. ప్రెష్‌ ఎనర్జీ, మంచి మెసేజ్‌తో సినిమా ఉంది. డాలర్‌ డ్రీమ్స్‌ కోసం అందరూ అమెరికాకు పరుగులు పెడుతున్నారు. కథలోని కంటెంట్‌ను అందరికీ అర్ధమయ్యేలా సినిమా తీశారు-మంత్రి కేటీఆర్‌.
  • తూ.గో: కోటనందూరు మండలం అప్పలరాజుపేటలో విద్యుత్‌షాక్‌తో మామిడి శ్రీను అనే వ్యక్తి మృతి.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 56,837 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు.

బీజేపీ గూటికి మాజీ సీఎం..

Nadendla Bhaskar rao, బీజేపీ గూటికి మాజీ సీఎం..

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కాషాయం కండువా వార్తలు వినిపిస్తున్నాయి. దీని పై ఆయన స్పందిస్తూ బీజేపీలో చేరాలని చాలా రోజుల నుంచి ఒత్తిడి ఉందని ఆయన చెప్పారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత తన కొడుకు మనోహర్ పార్టీ మార్పు పై నిర్ణయం తీసుకుంటారని నాదెండ్ల భాస్కర్‌రావు అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ పార్టీలో చేరబోతున్నారు. శంషాబాద్‌లోని కేఎస్సీసీ కన్వెన్షన్ సెంటర్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అమిత్‌షా ప్రారంభిస్తారు. రంగారెడ్డి జిల్లా వహాడీషరీఫ్ సమీపంలో ఉన్న మామిడివల్లి గ్రామం రంగనాయకుల తండా గిరిజన మహిళా సోనికి పార్టీ తొలి సభ్యత్వాన్ని అందజేస్తారు. అనంతరం తెలంగాణ పార్టీ కోర్ కమిటీ నేతలతో అమిత్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా అమిత్ షా ఆధ్వర్యంలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు బీజేపీలో చేరబోతున్నారు.

గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనేపూడిలో 1935 జూన్‌ 23న జన్మించిన నాదెండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 వరకూ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 1983లో ఎన్టీఆర్‌తో కలిసి టీడీపీ స్థాపనలో కీలకపాత్ర పోషించానని చెప్పే నాదెండ్ల అదే ఏడాది టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1984లో ఎన్టీఆర్‌ను పీఠం నుంచి దింపేసి సీఎం అయ్యారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు… అంటే కేవలం నెల రోజులు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తిరిగి 1998లో తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో ఖమ్మం ఎంపీగా గెలిచారు. ఆ తరువాత దశాబ్ద కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తాజాగా బీజేపీలో చేరబోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన ఆయన కుమారుడు మనోహర్‌ ప్రస్తుతం జనసేనలో ముఖ్యనేతగా ఉన్నారు.

Related Tags