Breaking News
  • ఏపీ గవర్నర్‌కు టీడీపీ శాసనసభాపక్షం లేఖ. లాక్‌డౌన్‌లో అందించే ఆర్థిక సాయాన్ని వైసీపీ దుర్వినియోగం చేస్తోంది. రూ.వెయ్యి, నిత్యావసరాలను దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నేతలు నగదు పంపిణీ చేస్తున్నారు. సామాజిక దూరం పాటించకుండా నగదు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు. రూ.వెయ్యి పంపిణీలో వైసీపీ నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచారంలా వాడుకుంటున్నారు. చట్టవ్యతిరేకంగా వ్యహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు.
  • ప.గో: ద్వారకాతిరుమలలో క్షుద్రపూజల కలకలం. చెరువువీధిలోని ఓ ఇంటి ఎదుట బొమ్మ, పసుపు, కుంకుమ.. ముగ్గు, నిమ్మకాయలతో చేతబడి చేసినట్టు అనుమానం. భయాందోళనలో గ్రామస్తులు.
  • తెలంగాణలో మర్కజ్‌ టెన్షన్‌. నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో.. ఇంకా పాజిటివ్‌ కేసులున్నాయని విచారిస్తున్న అధికారులు. మర్కజ్‌ వెళ్లొచ్చిన వాళ్లను కలిసిన పలువురిని క్వారంటైన్‌కు తరలింపు. నిన్నటి వరకు మొదటి స్టేజ్‌గా నేరుగా మర్కజ్‌ వెళ్లొచ్చిన వారితో.. సంబంధాలు ఉన్నవారి శాంపిల్స్‌ తీసుకున్న వైద్య సిబ్బంది. ఈ రోజు నుంచి రెండో స్టేజ్‌ విచారణ. నిన్న శాంపిల్స్ తీసుకున్న వారు ఎవరెవరిని కలిశారో పోలీసుల విచారణ.
  • నిజామాబాద్‌: జిల్లాలో మరో కరోనా అనుమానిత వ్యక్తి మృతి. మోపాల్‌ మండలం కంజరలో హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి మృతి. గత నెల దుబాయి నుంచి వచ్చిన వ్యక్తి. భయాందోళనలో గ్రామస్తులు.
  • వికారాబాద్‌ జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు. మర్కజ్‌ వెళ్లొచ్చిన 18 మందిలో నలుగురికి పాజిటివ్‌. వికారాబాద్‌, మర్పల్లి, పరిగి, తాండూరు వాసులుగా గుర్తింపు. నలుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించిన అధికారులు. -వికారాబాద్‌ జిల్లా వైద్యాధికారి దశరథ్‌. పరిగిలో హైఅలర్ట్‌ ప్రకటించిన పోలీసులు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిక. ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు -పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌.

ఫెదరర్‌ దారుణ ఓటమి..ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు నాదల్‌

Nadal hands Federer worst Slam loss in 11 years to reach 12th French Open final, ఫెదరర్‌ దారుణ ఓటమి..ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు నాదల్‌

ప్యారిస్‌: క్లే కోర్ట్ కింగ్, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రఫేల్‌ నాదల్‌ అద్భుతం చేశాడు. తన ప్రియ మిత్రుడు, చిరకాల ప్రత్యర్థి రోజర్‌ ఫెదరర్‌ను చిత్తు చేశాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సెమీస్‌లో 6-3, 6-4, 6-2తో వరుస సెట్లను కైవసం చేసుకొని ఘన విజయం సాధించాడు. కెరీర్‌లో 12వ సారి ఫ్రెంచ్‌ టైటిల్‌ గెలిచేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు. 11 ఏళ్లలో ఎర్రమట్టి కోర్టులో ఫెదరర్‌కు నాదల్‌ అత్యంత ఘోర పరాజయం రుచి చూపించడం గమనార్హం. ఫైనల్లో అతడు ప్రపంచ నంబర్‌ 1 నొవాక్‌ జొకోవిచ్‌ లేదా డొమినిక్‌ థీమ్‌తో తలపడతాడు.

రఫెల్‌ నాదల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌కు చేరుకోవడం ఇది 12వ సారి. ఇంతకు ముందెప్పుడు ఓడిపోలేదు. మ్యాచ్‌ తర్వాత నాదల్‌ మాట్లాడుతూ.. ‘రోజర్‌తో ఆడటం అద్భుతం. అతడికి అభినందనలు. 37 ఏళ్ల వయసులో ఆడటం మామూలు విషయం కాదు. మరో ఫైనల్‌ చేరుకున్నందుకు ప్యారిస్‌ అభిమానులకు ధన్యవాదాలు. ఫెదరర్‌తో ఆడటం నాకెప్పుడూ సంతోషం, సంక్లిష్టం’ అని నాదల్‌ తెలిపాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తన గెలుపు ఓటముల రికార్డును రఫా 92-2కు పెంచుకున్నాడు. రోజర్‌ను ఆరో సారి ఓడించాడు.

Related Tags