Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

మిస్టరీ: అఙ్ఞాతంలోకి వృద్ధ తల్లిదండ్రులు.. ఇప్పుడు ఎక్కడున్నారు..?

Where is World's oldest parents, మిస్టరీ: అఙ్ఞాతంలోకి వృద్ధ తల్లిదండ్రులు.. ఇప్పుడు ఎక్కడున్నారు..?

ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా సెప్టెంబర్ 5న ఆడకవలలకు జన్మనిచ్చి.. 74ఏళ్ల వయసులో తల్లిదండ్రులై తమ చిరకాల కోరికను నెరవేర్చుకున్న ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులు ఎక్కడున్నారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. వారికి తెలిసిన వారందరికీ కూడా ఇప్పుడు ఇదే ఒక ప్రశ్నగా మిగిలింది. ప్రపంచంలోనే సంచలనం రేకెత్తించిన ఈ వృద్ధుల జాడను తెలుసుకునేందుకు బంధువులు, డాక్టర్లను సంప్రదించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. తూర్పు గోదావరి జిల్లాలోని నేలప్రత్తిపాడు వీరి స్వగ్రామం కాగా.. గత కొన్ని రోజులుగా అక్కడ వారి ఇంటికి తాళాలు వేసి ఉండటం గమనర్హం. ఇక వీరి గురించి సమాచారం తెలుసుకునేందుకు గ్రామస్తులను ప్రశ్నించినప్పటికీ.. వారు కూడా తమకు తెలీదంటూ తెల్లమొహం వేయడంతో.. ఇప్పుడు వృద్ధ దంపుతుల గురించి చర్చ నడుస్తోంది.

అయితే ఎలాగైనా పిల్లలను కనాలని భావించిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులు గత ఏడాది ఊరిని విడిచి, గుంటూరుకు వెళ్లారు. అక్కడ బంధువుల ఇంట్లో ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకున్న మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చింది. దీంతో ఒక్కసారిగా వీరు సెలబ్రిటీలు అయ్యారు. అయితే లేటు వయసులో ఇలా పిల్లలకు జన్మనివ్వడంతో వీరిపై కొందరు విమర్శలు కూడా గుప్పించారు. ఈ వయసులో ఆ పిల్లల ఆలనాపాలనా ఎలా చూసుకుంటారు..? వయసు మీద పడింది కాబట్టి ఆ పిల్లల భవిష్యత్ ఏంటి..? ఇలా పలు ప్రశ్నలు వినిపించాయి. ఇక కొందరు డాక్టర్లపై కూడా విమర్శలు కురిపించారు. మీరైనా వారి వయసును దృష్టిలో పెట్టుకోవాల్సింది..? అని విమర్శించారు. ఈ క్రమంలో మీడియాకు దూరంగా ఉండాలంటూ డాక్టర్లు సూచించగా.. ఇప్పుడు తమ స్వగ్రామానికి కూడా దూరంగా ఉంటున్నారు వీరు. ఈ దంపతుల గురించి తెలుసుకునేందుకు ఓ జాతీయ దిన పత్రికా ప్రతినిధులు డాక్టర్లను ప్రశ్నించగా.. వారు ఎక్కడి నుంచి వచ్చారో తమకు కచ్చితంగా తెలీదని, కానీ వారిని డిస్టర్బ్ చేయకపోవడమే మంచిదని చెప్పుకొచ్చారు. ఇక రాజారావు బంధువులలో ఒక వ్యక్తికి ఫోన్ చేయగా.. వారు కచ్చితంగా కృష్ణ లేదా గుంటూరు జిల్లాలో ఉంటారంటూ చెప్పుకు రావడం పత్రికా ప్రతినిధులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

కాగా గతేడాది నేలప్రత్తిపాడును విడిచిన ఈ ఇద్దరు తల్లిదండ్రులు అవ్వడం కోసమే ఊరిని విడిచి వెళ్లారని తమకు తెలీదని, వార్తల్లో వచ్చినప్పుడే తమకు ఈ విషయం తెలిసిందని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. ఇక పిల్లలు పుట్టిన తరువాత గ్రామానికి వచ్చిన వారు.. ఓ చిన్న ఫంక్షన్‌ను చేశారని, దానికి వారి బంధువులు కూడా హాజరయ్యారని ఓ గ్రామస్తుడు పేర్కొన్నాడు. రాజారావుకు నేలప్రత్తిపాడులో 15 ఎకరాల పొలం ఉందని.. దానిని చూసుకునేందుకు కొన్ని వారాల క్రితం ఊరికొచ్చాడని.. పనిని పూర్తి చేసుకొని త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోయాడని.. పిల్లల గురించి అడిగితే బావున్నారంటూ చెప్పుకొచ్చారని ఓ వ్యక్తి వెల్లడించాడు. అంతేకాదు ఫోన్‌లో కూడా ఆ గ్రామస్తులతో రాజారావు కాంటాక్ట్‌లో లేరని తెలుస్తోంది. ఇక వీరు ఇప్పుడు ఎక్కడున్నారన్న దానిపై స్థానిక పోలీసులు సంప్రదించినా.. ఫలితం శూన్యం. దీంతో ఈ వృద్ధ దంపుతులు ఎక్కడున్నారు..? ఆ కవలలు ఎలా ఉన్నారు..? మంగాయమ్మ ఆరోగ్యం ఎలా ఉంది..? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.