‘మ‌రుగుజ్జు గ్ర‌హం’పై స‌మృద్ధిగా నీరు

మార్స్, బృహ‌స్ప‌తి మ‌ధ్య ప్ర‌ధాన ఉల్క బెల్ట్‌లో ఉన్న మ‌రుగుజ్జు గ్ర‌హం సెరెస్‌పై స‌మృద్ధిగా నీరు ఉన్న‌ట్లు గుర్తించింది అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ నాసా. డాన్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి వ‌చ్చిన స‌మాచారంతో ఈ మేర‌కు నిర్థారించారు శాస్త్ర‌వేత్త‌లు. మార్స్‌, బృహ‌స్ప‌తి మ‌ధ్య ప్రధాన ఉల్క బెల్ట్‌లో..

'మ‌రుగుజ్జు గ్ర‌హం'పై స‌మృద్ధిగా నీరు
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2020 | 12:25 AM

మార్స్, బృహ‌స్ప‌తి మ‌ధ్య ప్ర‌ధాన ఉల్క బెల్ట్‌లో ఉన్న మ‌రుగుజ్జు గ్ర‌హం సెరెస్‌పై స‌మృద్ధిగా నీరు ఉన్న‌ట్లు గుర్తించింది అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ నాసా. డాన్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి వ‌చ్చిన స‌మాచారంతో ఈ మేర‌కు నిర్థారించారు శాస్త్ర‌వేత్త‌లు. మార్స్‌, బృహ‌స్ప‌తి మ‌ధ్య ప్రధాన ఉల్క బెల్ట్‌లో ఉన్న మ‌రుగుజ్జు గ్ర‌హం దీన్నే సెరెస్ అని కూడా అంటారు. గ‌తంలో శాస్త్ర‌వేత్త‌లు అభిప్రాయ ప‌డిన‌ట్టు అది అంత‌రిక్ష‌శిల కాద‌ని నాసా తెలిపిన తాజా నివేదిక ప్ర‌కారం వెలుగులోకి వ‌చ్చింది. ఈ మరుగుజ్జు గ్ర‌హం నీటితో స‌మృద్ధిగా ఉన్న‌ట్టు నిర్థార‌ణ అయింది. సెరెస్ ఉప‌రిత‌లం కింద ఉప్పునీటి జ‌లాశ‌యం ఉన్న‌ట్లు గుర్తించారు నాసా శాస్త్ర‌వేత్త‌లు. అది 40 కిలో మీట‌ర్ల లోతు, వంద‌ల మైళ్ల వెడ‌ల్పు ఉంటుంద‌ని అంచాన వేస్తున్నారు. ఈ ప‌రిశోధ‌న‌కు సంబంధించిన విష‌యం ఆగ‌ష్టు 10న నేచ‌ర్ ఆస్ట్రాన‌మీ, నేచ‌ర్ జియో సైన్స్‌లో ప్ర‌చురిత‌మైనది.

ఈ సంద‌ర్భంగా మిష‌న్ డైరెక్ట‌ర్ మార్క్ రాయ్‌మ‌న్ మాట్లాడుతూ సెరెస్ అనేది చంద్రుడి కంటే చాలా చిన్న గ్ర‌హమ‌న్నారు. డాన్ అంత‌రిక్ష నౌక 2015లో సెరెస్ సమీపంలోకి చేరుకుంది. ఈ మిష‌న్‌కు ముందే టెలీస్కోపుల స‌హాయంతో ప్రకాశ‌వంత‌మైన ప్రాంతాల‌ను శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. కానీ వాటి స్వభావం తెలియ‌లేదు. 2018 అక్టోబ‌ర్‌లో మిష‌న్ ముగింపు ద‌శ‌లో సెరెస్‌పై ప్ర‌కాశ‌వంత‌మైన ప్రాంతాల గుట్టు వీడింది. సెరెస్‌పై సోడియం కార్పొనేట్‌తో నిండిన నిక్షేపాలు ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.

Read More:

ధోనీ పేరుతో జొమాటో అద్భుత‌మైన ఆఫ‌ర్‌

ఏపీఎస్ఆర్టీసీ స‌రికొత్త సేవ‌లు.. బ‌స్సుల్లో వైఎస్సార్ జ‌న‌తా బ‌జార్లు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

వెద‌ర్ వార్నింగ్ః తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్