కేరళ… ఆ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది ?

తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 'విచిత్రాలు' జరుగుతున్నాయి. ఆత్మహత్యలు, ఆసుపత్రి నుంచి పరారీలు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు, కరోనా టెస్టింగుల్లో జాప్యం, నిర్లక్ష్యం.. ఇలా ఒకదాని వెనుక ఒకటి జరుగుతున్నా..

కేరళ... ఆ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 11, 2020 | 5:52 PM

తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ‘విచిత్రాలు’ జరుగుతున్నాయి. ఆత్మహత్యలు, ఆసుపత్రి నుంచి పరారీలు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు, కరోనా టెస్టింగుల్లో జాప్యం, నిర్లక్ష్యం.. ఇలా ఒకదాని వెనుక ఒకటి జరుగుతున్నా.. ఇదేమిటని అడిగే నాథుడే లేకుండా పోయాడు. ఉదాహరణకు నిన్నటికి నిన్న.. 33 ఏళ్ళ ఉన్ని అనే పెయింటర్, 38 ఏళ్ళ మురుగన్ అనే కార్పెంటర్ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిద్దరూ మద్యానికి అలవాటు పడ్డారని, కరోనా పాజిటివ్ లక్షణాలు తగ్గినట్టు కనిపించారని ఈ మెడికల్ కాలేజీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 9 న ఉన్ని తన ఐసోలేషన్ రూమ్ నుంచి  తప్పించుకుని తన గ్రామానికి పారిపోయాడని, అయితే కొంతమంది ఇఛ్చిన సమాచారంతో పోలీసులు అతడి గ్రామానికి వెళ్లి అతడ్ని మళ్ళీ ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిసింది. కానీ మరుసటి రోజునే ఉన్ని తన రూమ్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఇక మురుగన్ కూడా మద్యం మత్తులో రోడ్డుపై పడి ఉండగా స్థానికులు తెలిపిన సమాచారంతో పోలీసులు అతడిని ఈ హాస్పిటల్ కి తీసుకువచ్చారు.  కానీ ఏ కారణంవల్లో అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ఘటనలో వర్గీస్ అనే వ్యక్తి ఈ నెల 2 న మరణించాడు. అతనికి కనీసం పదిహేను రోజుల క్రితమే కరోనా లక్షణాలు కనిపించాయి. కానీ సరిగా టెస్టులేవీ చేయకపోవడంతో రెండో తేదీన మృతి చెందాడు. ఇలాగే విదేశాల నుంచి వఛ్చిన ఇద్దరికి కూడా  కరోనా పరీక్షలు జరపలేదని తెలియవచ్చింది.

ఓవైపు కరోనా వైరస్ కేసుల విషయంలో కేరళ రాష్ట్రం దేశంలోనే అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోందని, కరోనా మరణాలను నియంత్రించగలుగుతోందని వార్తలు వస్తుండగా.. ఈ మెడికల్ కాలేజీ వ్యవహారం మాత్రం ఇందుకు పూర్తి విరుధ్ధంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!