నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది.. మరో పదేళ్లు నేనే సీఎం !

my health is very good says telangana cm kcr, నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది.. మరో పదేళ్లు నేనే సీఎం !

తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్లను తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. తన హెల్త్ భేషుగ్గా ఉందని, ఈ టర్మ్ తో బాటు మరో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆదివారం మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం తన వయస్సు 66 ఏళ్ళని, మరో పదేళ్లు పని చేయలేనా అని ప్రశ్నించారు. కేటీఆర్ ని ఇప్పుడే సీఎం చేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తొసిపుచ్చారు. ‘ ఈ పదవిని నేను కేటీఆర్ కు అప్పగిస్తానా ? ఎందుకలా చేస్తాను ? నాకు ఆరోగ్యం బాగా లేదని, అమెరికా వెళ్తానని ప్రచారం చేస్తున్నారు. కానీ నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను.. మరో పదేళ్లు ముఖ్యమంత్రిని నేనే.. టీఆరెస్ మూడు దఫాలు అధికారంలోకి వస్తుంది ‘ అని కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *