అర్ధ సెంచరీ నా కూతురికి అంకితం- రోహిత్ శర్మ

Rohit Sharma and His Daughter Bonding, అర్ధ సెంచరీ నా కూతురికి అంకితం- రోహిత్ శర్మ

ముంబయి: ఐపీఎల్‌ 12వ సీజన్లో ముంబయి ఇండియన్స్‌ జోరు కొనసాగిస్తోంది. నిన్న సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో కోల్‌కతాను మట్టి కరిపించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ జట్టు సారథి రోహిత్‌ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్‌ గారాలపట్టీ సమైరా సందడి చేసింది. నిండా ఆరునెలలు కూడా లేని సమైరా తన ఆటను బాగా ఎంజాయ్‌ చేసిందని రోహిత్‌ మురిసిపోతున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న తర్వాత బ్యాట్‌ను ఒళ్లోకి తీసుకుని ముద్దాడుతున్నట్టుగా సెలబ్రేట్ చేసుకున్నాడు రోహిత్ శర్మ. తన కూతురు సమైరాను ఎత్తుకున్నట్టుగా ఫీలై, ఆమెకి అలా హాఫ్ సెంచరీని అంకిత మిచ్చినట్టు చెప్పాడు రోహిత్.

మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ ‘ఇక్కడ మ్యాచ్‌ జరిగిన ప్రతిసారీ నా కూతురు నా ఆటను చూడటానికి వస్తుంది. ఈ రోజు కూడా వచ్చింది. అయితే మ్యాచ్‌ ఆరంభంలో నేను ఎక్కువ పరుగులు చేయలేదు. కానీ  నేను అర్ధ శతకం సాధించేలోపు తను నిద్రపోయింది. అందుకే ఈ అర్ధశతకం తనకి అంకితమిచ్చేస్తున్నాను. ఇక ఆట విషయానికొస్తే..ఐపీఎల్‌ నిజంగా ఫన్నీ టోర్నమెంట్. ఇందులో ఏ జట్టు దేనినైనా ఓడించవచ్చు. ఈ ఐపీఎల్‌లో మా ప్రయాణం బాగున్నప్పటికీ మేం మెరుగు పరుచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. జట్టు సభ్యుల మధ్య సమన్వయం వల్లే విజయాలు సాధించగలుగుతున్నాం. ఒకరి మీదే ఒత్తిడి పెంచి వారి మీదే ఆధారపడం. గెలుపులోనైనా, ఓటమిలోనైనా అందరి చేయి పడాల్సిందే. ఐపీఎల్‌ బిజినెస్‌ గురించి, దాని విషయాలు తెలిసిన వాళ్లం. ఫ్రాంచైంజీలకు ప్రోత్సాహం ఇవ్వాలంటే మనం ది బెస్ట్‌గా పనిచేయాల్సి ఉంటుంది’ అని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *