ఇంత నిర్లక్ష్యమా.. జూలై 5న టెస్టు చేయించుకుంటే.. ఇప్పటికీ రిపోర్టు రాలేదట..!

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా వైరస్‌ను అడ్డుకోవాలంటే.. టెస్టుల సంఖ్య పెంచుతూ.. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే గుర్తించి.. వారికి చికిత్స అందించాలి. ఆ తర్వాత..

ఇంత నిర్లక్ష్యమా.. జూలై 5న టెస్టు చేయించుకుంటే.. ఇప్పటికీ రిపోర్టు రాలేదట..!
Follow us

| Edited By:

Updated on: Jul 21, 2020 | 8:07 PM

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా వైరస్‌ను అడ్డుకోవాలంటే.. టెస్టుల సంఖ్య పెంచుతూ.. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే గుర్తించి.. వారికి చికిత్స అందించాలి. ఆ తర్వాత వారి కాంటాక్ట్‌ కేసులను గుర్తించి.. క్వారంటైన్‌లో ఉంచాలి. ఇలా చేస్తే.. కరోనా మహమ్మారి వేగాన్ని అదుపు చేయగలం. ఇది ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న తీరు. అయితే బిహార్‌లో టెస్టులు చేపడుతున్నప్పటికీ.. కొందరి రిపోర్టులు మూడు నాలుగు రోజుల తర్వాత వస్తున్నాయని.. ఇంకా మరికొందరి రిపోర్టుల వివరాలు పది రోజులు దాటినా కూడా తెలియడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్ ఈ ఆరోపణలు చేశారు. సోమవారం నాడు ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలో కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆరోపణలు చేశారు. తాను జూలై 5వ తేదీన కరోనా టెస్టులు చేయించుకున్నానని.. అయితే వాటి రిపోర్టులు ఇప్పటి వరకు కూడా రాలేదన్నారు. పాట్నాకు చెందిన సివిల్ సర్జన్ జూలై 5వ తేదీన తన శ్యాంపిల్స్ తీసుకెళ్లారని.. అయితే వాటి రిపోర్టులు సోమవారం జూలై 20వ తేదీ వరకు కూడా రాలేదన్నారు. గత పదిహేను రోజులుగా తాను 5 వేల మందిని కలిసి ఉంటానన్నారు. రాష్ట్రంలో కరోనా లెక్కలు అంతా గజిగజి ఉన్నాయని.. ప్రభుత్వం నిర్లక్ష్య దోరణిని వదులుకోవాలని హితవు పలికారు. ఇలా చేయడం ద్వారా కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తుందని.. దీనిని అరికట్టాలంటే పరీక్షల రిపోర్టులు త్వరగా వచ్చేలా చూడాలన్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!