నా బెస్ట్‌ఫ్రెండ్‌ ఇప్పుడొక ట్రాన్స్‌జెండర్‌: ఉపాసన

మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ భార్య అయినప్పటికీ చాలా సామాన్యంగా ఉంటారు ఉపాసన కామినేని కొణిదెల.

  • Manju Sandulo
  • Publish Date - 9:02 am, Sat, 24 October 20

Upasana Konidela News: మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ భార్య అయినప్పటికీ చాలా సామాన్యంగా ఉంటారు ఉపాసన కామినేని కొణిదెల. బిజినెస్‌విమెన్‌గానే కాకుండా సామాజికవేత్తగా మంచి గుర్తింపును సాధించుకున్న ఉపాసన.. అంతే బోల్డ్‌గా ఉంటారు. తనకు నచ్చని విషయాలను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేస్తుంటారు ఆమె. ఈ క్రమంలో తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను కూడా సంపాదించుకున్నారు.

కాగా ఇటీవల ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఉపాసన అందులో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. అందులో తన బెస్ట్‌ఫ్రెండ్‌ ఇప్పుడొక ట్రాన్స్‌జెండర్ అన్న విషయాన్ని ఆమె బయటపెట్టారు. ఇక ప్రతి ఇంట్లో మహిళలను గౌరవించాలని, మహిళలను గౌరవించని ఇంట్లో దేవికి కూడా ప్రార్థనలు చేయొద్దని ఉపాసన అన్నారు. అంతేకాదు పూజ నుంచి దేవి ఫొటోలను తీసేయాలని సూచించారు.

Read More:

Bigg Boss 4: టాస్క్‌ విజేత.. దివికి బంపరాఫర్‌

Bigg Boss 4: ఆసక్తికర సన్నివేశం.. అభికి అఖిల్‌కి సపోర్ట్‌