Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

మోదీ మందిర్ నిర్మాణానికి అనుమతి కోరారు!

ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశం కోసం ఎంతగానో సేవ చేస్తున్న ఈయనకు మందిరాలు నిర్మించడానికి వీరాభిమానులు ఎందరో ఉన్నారు. మొన్నీమధ్య మోదీ వీరాభిమాని ఒకరు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తే.. ప్రధాని ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని ఆ నిర్మాణాన్ని వెంటనే ఆపేశారు. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి మోదీ మందిర్ నిర్మిస్తామని కొందరు ముస్లిం మహిళలు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.

వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్ నగర్‌ బీజేపీ ముస్లిం విభాగానికి చెందిన సమర్ గజ్ని, రూబీ గజ్ని.. తమ సొంత భూమిలో ‘మోదీ మందిర్’ను ఏర్పాటు చేస్తామని.. దాని నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు.  ప్రధాని మోదీ దేశం, దేశ ప్రజల కోసం ఎంతో సేవ చేశారని.. ఆయనకు విదేశాలు కూడా పురస్కారాలు ఇస్తున్నాయన్నారు. అందుకే కృష్ణపురి ప్రాంతంలో ‘మోదీ మందిర్’ పేరుతో ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలనీ భావిస్తున్నట్లుగా చెప్పారు. ఈ మందిర్‌లో మోదీ సంబంధించిన వివరాలతో పాటుగా ఆయన విగ్రహాన్ని కూడా నిర్మిస్తామన్నారు. మరి ఈ మందిర్ ఏర్పాటుకు మోదీ ఓకే అంటారో లేదో వేచి చూడాలి.?