నేను కళ్లు తెరిచిందే యుద్ధ భూమిలో…. బయోపిక్‌పై మురళీధరన్‌ వివరణ

ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్ బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే! 800 పేరుతో వస్తున్న ఆ సినిమాలో మురళీధరన్‌ పాత్రను సుప్రసిద్ధ నటుడు విజయ్‌ సేతుపతి ధరిస్తున్న సంగతి కూడా తెలిసిన విషయమే! ఆ సినిమా మోషన్‌ పోస్టర్‌ వచ్చినప్పటి నుంచి విజయ్‌సేతుపతిపై తమిళనాడుకు చెందిన అనేక రాజకీయపార్టీలు విమర్శలు చేయడం మొదలు పెట్టారు.. మురళీధరన్‌ పాత్ర చేస్తావా? ఎంత ధైర్యం అని ఆడిపోసుకుంటున్నారు.. చేస్తే తప్పేమిటన్న వారు కూడా […]

నేను కళ్లు తెరిచిందే యుద్ధ భూమిలో.... బయోపిక్‌పై మురళీధరన్‌ వివరణ
Follow us

|

Updated on: Oct 17, 2020 | 9:49 AM

ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్ బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే! 800 పేరుతో వస్తున్న ఆ సినిమాలో మురళీధరన్‌ పాత్రను సుప్రసిద్ధ నటుడు విజయ్‌ సేతుపతి ధరిస్తున్న సంగతి కూడా తెలిసిన విషయమే! ఆ సినిమా మోషన్‌ పోస్టర్‌ వచ్చినప్పటి నుంచి విజయ్‌సేతుపతిపై తమిళనాడుకు చెందిన అనేక రాజకీయపార్టీలు విమర్శలు చేయడం మొదలు పెట్టారు.. మురళీధరన్‌ పాత్ర చేస్తావా? ఎంత ధైర్యం అని ఆడిపోసుకుంటున్నారు.. చేస్తే తప్పేమిటన్న వారు కూడా ఉన్నారు.. నటి రాధిక అయితే సూటిగా ఓ ప్రశ్న వేశారు.. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ మురళీధరన్‌ను కోచ్‌గా నియమించుకున్నప్పుడు ఈ గొంతులన్నీ ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు.. ఈ గొడవలన్నీ ఎందుకన్న ఉద్దేశంతో మురళీధరనే స్వయంగా కల్పించుకున్నారు.. వివరణ ఇచ్చుకున్నారు.. ‘జీవితంలో వివాదాలు నాకు కొత్త కాదు.. ఎన్నో వివాదాలు నన్ను సుడిగుండాల్లా చుట్టుముట్టాయి.. ఈ చిత్రం ఎందుకు తీస్తున్నారో.. ఏ ఉద్దేశంతో నా జీవిత చరిత్రను తెరపైకి ఎక్కిస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత నాకుంది.. నేను పుట్టిందే యుద్ధ భూమిలో.. కళ్లు తెరచిననాటి నుంచి యుద్ధ బీభత్సాన్ని చూస్తూ వచ్చాను.. ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు నా తండ్రి చనిపోయాడు. కుటుంబ అవసరాల కోసం అనేక ఇబ్బందులు పడ్డాం.. అంతర్యుద్ధం మా జీవితాలను అస్తవ్యస్తం చేశాయి.. ఈ ఇబ్బందులను ఎలా అధిగమించగలిగాను? క్రికెట్‌లో ఎలా నిలదొక్కగలిగాను? ఎలా విజయం సాదించగలిగాను? అన్నవే ఈ సినిమాలో ప్రధానాంశాలు! శ్రీలంకలో తమిళుడుగా పుట్టడం నా తప్పు కాదు కదా! నేను శ్రీలంక జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాను.. ఆ కారణంగానే నేను కొన్ని విషయాలు తప్పుగా అర్థం చేసుకున్నాను.. ఈ చిత్రంపై అనవసరంగా రాజకీయం అలుముకుంటోంది.. నేను శ్రీలంకలో జరిగిన మారణహోమానికి మద్దతు ఇచ్చానంటూ ఆరోపణలు చేస్తున్నారు.. నేను అవగాహనారాహిత్యంతో కొన్ని మాటలు తప్పుగా మాట్లాడి ఉండవచ్చు.. అవి ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.. నన్ను బాధిస్తూనే ఉన్నాయి.. నాపై విమర్శలకు కారణమవుతూనే ఉన్నాయి. 2009లో అంతర్యుద్ధం ముగిసింది.. జీవితమంతా యుద్ధ సీమలో గడిపినవారికి అదో ఊరట! ఇప్పుడు ఎవరి ప్రాణాలు పోవడం లేదన్న సంతోషం.. నేను ప్రశాంత జీవితం గడపాలనుకుంటున్నా.. తమిళ ప్రజలలో ఆత్మవిశ్వాసం ప్రోది చేయడానికే ఈ జీవిత చరిత్రను సినిమాగా తీయాలనుకుంటున్నా’ అని ఆవేదనతో చెప్పుకొచ్చాడు మురళీధరన్‌.

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!