నిఘా నీడలో బక్రీద్: జమ్మూకశ్మీర్‌

జమ్మూకశ్మీర్‌లో నిఘా నీడలో ముస్లింలు ఈద్ జరుపుకుంటున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జమ్మూలో ఈద్ ప్రార్థనలు చేశారు. అడుగడుగున తనికీలు నిర్వహించిన తర్వాత మాత్రమే ప్రార్థన మందిరాలకు ముస్లింలను అనుమతించారు. అటు శ్రీనగర్‌లో మళ్లీ నిషేదాజ్ఞలు విధించారు. సెక్షన్ 144ను ఉపసంహరించాక చెదురుముదురు ఘటనలు చోటు చేసుకోవడంతో మరోసారి ఆంక్షలు విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. దాంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. నిషేదాజ్ఞల వల్ల వ్యాపారాలు సరిగా సాగకపోవడంతో వారం రోజుల్లో […]

నిఘా నీడలో బక్రీద్: జమ్మూకశ్మీర్‌
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2019 | 5:56 PM

జమ్మూకశ్మీర్‌లో నిఘా నీడలో ముస్లింలు ఈద్ జరుపుకుంటున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జమ్మూలో ఈద్ ప్రార్థనలు చేశారు. అడుగడుగున తనికీలు నిర్వహించిన తర్వాత మాత్రమే ప్రార్థన మందిరాలకు ముస్లింలను అనుమతించారు. అటు శ్రీనగర్‌లో మళ్లీ నిషేదాజ్ఞలు విధించారు. సెక్షన్ 144ను ఉపసంహరించాక చెదురుముదురు ఘటనలు చోటు చేసుకోవడంతో మరోసారి ఆంక్షలు విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. దాంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. నిషేదాజ్ఞల వల్ల వ్యాపారాలు సరిగా సాగకపోవడంతో వారం రోజుల్లో వ్యాపారులకు రూ. వెయ్యి కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. కశ్మీర్‌లో సగటున రోజుకు రూ. 175 కోట్ల వ్యాపారం జరుగుతుందని, అదంతా ఆంక్షల వల్ల ఆగిపోయిందని వ్యాపారస్తులు చెబుతున్నారు. బేకరీలకు రూ. 200 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. బక్రీద్ సందర్భంగా గొర్రెల అమ్మకాలతోపాటు దుస్తుల అమ్మకాలు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.
[svt-event date=”12/08/2019,5:51PM” class=”svt-cd-green” ]

[/svt-event]