Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

సీఏఏపై రాధ్ధాంతమెందుకు ? ఇదిగో ప్రూఫ్ ! నిర్మల

muslims of pakistan afghanistan and bangladesh  also got indian  citizenship, సీఏఏపై రాధ్ధాంతమెందుకు ? ఇదిగో ప్రూఫ్ ! నిర్మల

సీఏఏను అమలు చేసేందుకు పలు రాష్ట్రాలు నిరాకరిస్తున్నాయని, అయితే ఇది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుధ్ధమని అన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. నిజానికి గత ఆరేళ్లలో 2,838 మంది పాకిస్తానీయులు, 914 మంది ఆఫ్ఘన్లు, 172 మంది బంగ్లాదేశియులు భారత పౌరసత్వం పొందారని ఆమె చెప్పారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. గత రెండేళ్లలోనే 391 మంది ఆఫ్ఘన్లకు, 1595 మంది పాకిస్తానీయులకు ఇక్కడి పౌరసత్వం లభించిందని తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన గణాంకాలను ఆమె  ప్రస్తావిస్తూ..ఇలా పౌరసత్వం పొందినవారిలో ముస్లిములు కూడా ఉన్నారన్నారు. 2014 నుంచి ఈ మూడు దేశాలకు చెందిన అనేకమంది ముస్లిములకు భారత సిటిజన్ షిప్ లభించిన విషయాన్ని  విస్మరించరాదన్నారు.

వాస్తవాలను వక్రీకరించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. సవరించిన చట్టంపై పార్లమెంటులో విపక్షాలు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకూ ప్రభుత్వం సమాధానమిచ్చిందని ఆమె గుర్తు చేశారు. శ్రీలంక తమిళులు నివసిస్తున్న శిబిరాల్లో పరిస్థితి దారుణంగా ఉందని, అయితే మానవహక్కుల సంఘాలు దానిగురించి మాట్లాడవెందుకని ఆమె ప్రశ్నించారు.

 

Related Tags