ముస్లింలే గొప్ప దేశ భక్తులంటున్న ఎంపీ..

ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సమాజ్ వాద్ పార్టీ ఎంపీ ఆజంఖాన్.. ఈ సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1947లో దేశ విభజన జరిగే సమయంలో.. ముస్లింలకు పాకిస్థాన్ వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. ఎంతో మంది ముస్లింలు అలా చేయలేదన్నారు. అలాంటి అవకాశం లేనివారికంటే.. అవకాశం ఉండి కూడా.. ఎంతో మంది ఇక్కడే ఉండిపోయారని గుర్తు చేశారు. వీరంతా అతిపెద్ద దేశభక్తులని ఆజంఖాన్ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. […]

ముస్లింలే గొప్ప దేశ భక్తులంటున్న ఎంపీ..
Follow us

| Edited By:

Updated on: Dec 10, 2019 | 5:03 PM

ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సమాజ్ వాద్ పార్టీ ఎంపీ ఆజంఖాన్.. ఈ సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1947లో దేశ విభజన జరిగే సమయంలో.. ముస్లింలకు పాకిస్థాన్ వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. ఎంతో మంది ముస్లింలు అలా చేయలేదన్నారు. అలాంటి అవకాశం లేనివారికంటే.. అవకాశం ఉండి కూడా.. ఎంతో మంది ఇక్కడే ఉండిపోయారని గుర్తు చేశారు. వీరంతా అతిపెద్ద దేశభక్తులని ఆజంఖాన్ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన సమయంలో ముస్లింలకు మినహా ఎవరికీ పాకిస్థాన్ వెళ్లే వెసులుబాటు లేదని గుర్తుచేశారు. అయినప్పటికీ.. చాలామంది భారత్ విడిచి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారన్నారు. ఇలా ఉండిపోయిన వాళ్లంతా గొప్పదేశభక్తులనీ.. లాంటి వీరి దేశభక్తినే.. శిక్షిస్తామంటే ఎలా అంటూ…పౌరసత్వ సవరణ బిల్లును ఉద్దేశించి.. కేంద్రాన్ని ప్రశ్నించారు.

తాజాగా లోక్‌సభలో పౌరసత్వ బిల్లులపై విపక్షాల మాటను ప్రభుత్వం వినిపించుకోలేదన్నారు. మెజార్టీ ఆధారంగానే నిర్ణయం తీసుకుంటున్నారన్న ఆయన.. సభలో విపక్షాలకు తగినంత సంఖ్యాబలం లేదని.. దీంతో వీరి మాట వినే వారేలేరన్నారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో విపక్షాల ప్రతిమాటను.. అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోవాలని.. వాళ్ల మాటను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. కాగా, పౌరసత్వ సవరణ బిల్లుపై సోమవారం సుమారు 12 గంటల పాటు చర్చజరిగింది. అనంతరం అదేరోజు లోక్‌సభ ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు, ప్రతికూలంగా 80 ఓట్లు వచ్చాయి.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.