మతసామరస్యం వెల్లివిరిసిన వేళ.. హిందూ యువకునికి ముస్లిం మహిళ రక్తదానం..

కోవిద్-19 మహమ్మారి విల తాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. పవిత్ర రంజాన్ మాసంలో 29 ఏళ్ల అలీషా ఖాన్ తన రక్తాన్ని ఒక హిందూ యువకునికి దానం చేసి, అతని ప్రాణాలను కాపాడటమే

మతసామరస్యం వెల్లివిరిసిన వేళ.. హిందూ యువకునికి ముస్లిం మహిళ రక్తదానం..
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2020 | 4:42 PM

కోవిద్-19 మహమ్మారి విల తాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. పవిత్ర రంజాన్ మాసంలో 29 ఏళ్ల అలీషా ఖాన్ తన రక్తాన్ని ఒక హిందూ యువకునికి దానం చేసి, అతని ప్రాణాలను కాపాడటమే కాకుండా, మతసామరస్యానికి ఒక ఉదాహరణగా నిలిచారు. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో చోటుచేసుకుంది. విజయ్ కుమార్ రాస్తోగి అనే యువకునికి ఓ నెగెటివ్ రక్తం అవసరమయ్యింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ రక్తం లభ్యంకాలేదు. ఇటువంటి పరిస్థితిలో షహీద్ భగత్ సింగ్ సేవా సమితి సహాయం అందించింది.

వివరాల్లోకెళితే.. సంస్థ అధ్యక్షుడు జస్పాల్ సింగ్ పాలి ఈ విషయాన్నిముస్లిం మహిళ అలీషాతో చెప్పినప్పుడు, ఆమె రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. రంజాన్ ఉపవాసం పూర్తయ్యాక రక్తదానం చేసింది. వినయ్ చాలా కాలంగా కాలేయ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు సామాజిక కార్యకర్త తృప్తి అవస్థీ తెలిపారు. కొన్ని రోజులుగా అతని శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు బాగా పడిపోవటం ప్రారంభించాయి. దీనితో అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ నేపధ్యంలో అలీషా అతనికి రక్తదానం చేసి, హిందూ-ముస్లిం ఐక్యతకు ఉదాహరణగా నిలిచింది.