ఆ 5 ఎకరాలు మాకెందుకు ? రివ్యూ పిటిషన్ వేస్తాం.. ముస్లిం పర్సనల్ లా బోర్డు

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని లక్నోలో సమావేశమైన ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలన్న రూలింగ్ ని సవాలు చేస్తామని, ఆ భూమిని తాము నిరాకరిస్తామని బోర్డు ప్రతినిధులు తెలిపారు. మసీదుకు సంబంధించిన స్థలం అల్లాకు చెందినదని, షరియత్ చట్టం కింద దాన్ని ఎవరికీ ఇవ్వజాలరని ఈ సమావేశం అనంతరం ఈ బోర్డు కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ అన్నారు. మసీదుకు మరే […]

ఆ 5 ఎకరాలు మాకెందుకు ? రివ్యూ పిటిషన్ వేస్తాం..  ముస్లిం పర్సనల్ లా బోర్డు
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 17, 2019 | 5:27 PM

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని లక్నోలో సమావేశమైన ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలన్న రూలింగ్ ని సవాలు చేస్తామని, ఆ భూమిని తాము నిరాకరిస్తామని బోర్డు ప్రతినిధులు తెలిపారు. మసీదుకు సంబంధించిన స్థలం అల్లాకు చెందినదని, షరియత్ చట్టం కింద దాన్ని ఎవరికీ ఇవ్వజాలరని ఈ సమావేశం అనంతరం ఈ బోర్డు కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ అన్నారు. మసీదుకు మరే ప్రత్యామ్నాయం లేదని ఆయన చెప్పారు. అటు-తమ రివ్యూ పిటిషన్ ను కోర్టు వంద శాతం కొట్టివేస్తుందని తమకు తెలుసునని, కానీ రివ్యూ పిటిషన్ ను తాము కూడా వేస్తామని జమాయిత్-ఉలేమా-ఎ-హింద్ అధినేత మౌలానా అర్షద్ మదానీ పేర్కొన్నారు. ‘ ఇది మా హక్కు ‘ అన్నారు. అయోధ్యపై కోర్టు తీర్పును తాము కూడా సవాలు చేస్తామన్నారు.

ముస్లిం పర్సనల్ లాబోర్డు సమావేశానికి హాజరైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా.. ఐదెకరాల స్థలాన్ని తాము కోరుకోవడంలేదని చెప్పారు.’ ఈ దానం మాకు వద్దు.. బాబరీ మసీదుకు సంబంధించి మా న్యాయబధ్ధమైన హక్కు కోసం పోరాడుతాం ‘ అని ఆయన అన్నారు. కాగా-సుప్రీంకోర్టు తీర్పుపై ఈ బోర్డు.. వివిధ ముస్లిం పార్టీలతో విస్తృత చర్చలు జరిపింది. రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలా, వద్దా అన్నదానిపై ఈ సమావేశాల్లో చర్చించారు. అత్యున్నత న్యాయస్థానం ఇఛ్చిన తీర్పు ‘ అర్థం కానిదిగా ‘ ఉందని, అందువల్ల రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించామని జిలానీ మళ్ళీ స్పష్టం చేశారు. నిజానికి మొదట ఈ నెల 3 న జరిగిన సమావేశంలో వివిధ ముస్లిం సంస్థల ఆఫీసు బేరర్లు, మత గురువులు.. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా.. దాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు. అయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించడం విశేషం.