ముస్లింల శుభలేఖపై హిందూ చిహ్నాలు

హిందూ, ముస్లిం అంటే భాయి..భాయి అన్న మనదేశ సంసృతిని మరోమారు రుజువు చేసింది ఉత్తరప్రదేశ్ లోని ఓ ముస్లిం కుటుంబం. గతంలో ముస్లింల ప్రార్థనా మందిరంలో హిందువులు పూజలు చేస్తున్నారన్న వార్తలు విన్నాం. ఇక్కడ మరింత ఆశ్చర్యం కలిగించే విషయం మరొకటి చోటు చేసుకుంది.

ముస్లింల శుభలేఖపై హిందూ చిహ్నాలు
Follow us

|

Updated on: Feb 28, 2020 | 7:26 PM

హిందూ, ముస్లిం అంటే భాయి..భాయి అన్న మనదేశ సంసృతిని మరోమారు రుజువు చేసింది ఉత్తరప్రదేశ్ లోని ఓ ముస్లిం కుటుంబం. గతంలో ముస్లింల ప్రార్థనా మందిరంలో హిందువులు పూజలు చేస్తున్నారన్న వార్తలు విన్నాం. ఇక్కడ మరింత ఆశ్చర్యం కలిగించే విషయం మరొకటి చోటు చేసుకుంది. ఏకంగా ముస్లింల పెళ్లి శుభలేఖలపై తెలుగు దేవుళ్ల బొమ్మలు ముద్రించారు. భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వాన్ని చాటుతున్న ఆ శుభలేఖలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సాధార‌ణంగా హిందువులు, ముస్లింలు ఏ ఇత‌ర వ‌ర్గానికి చెందిన వారైన సరే..వివాహ శుభ కార్యం జ‌రిపితే శుభ‌లేఖ‌లు అచ్చు వేయిస్తారు. ఆ త‌రువాత వాటిని బంధువులు, స్నేహితులు, ఇత‌ర తెలిసిన వారికి ఇస్తారు. అయితే ఉత్తరప్రదేశ్ మీరట్లోని హిస్తినాపూర్ ప్రాంతంలో ఓ వ్య‌క్తి తన కూతురికి వివాహం నిశ్చయించాడు. మార్చి 4న పెళ్లి ముహూర్తం పెట్టారు. దీంతో అత‌ను కూడా అంద‌రి లాగే శుభ‌లేఖ‌లు అచ్చు వేయించాడు. కానీ… త‌న‌కు హిందువులు స్నేహితులుగా ఎక్కువ మంది ఉండ‌డంతో ఆ శుభ‌లేఖ‌ల‌పై త‌మ మ‌తానికి చెందిన చిహ్నాలు కాకుండా వినాయ‌కుడి బొమ్మ‌ను అచ్చు వేయించాడు. ఈ పెళ్లి శుభలేఖలో హిందూ-ముస్లిం స్నేహాన్ని చాటి చెప్పేందుకు శుభలేఖల్లో హిందూ దేవుళ్లైన వినాయకుడు..రాధాకృష్ణుల బొమ్మలను ప్రింట్ చేయించాడు. వాటిని తమ స్నేహితులు, బంధువులకు పంచాడు.

అయితే, దీనిపై సదరు వ్యక్తిని వివరణ అడగగా..తన స్నేహితుల్లో చాలా మంది హిందువులే ఉన్నారని చెప్పాడు. మత విద్వేషాలు రోజు రోజుకూ పెరిగిపోతున్న నేటి సమాజంలో తను తీసుకున్న నిర్ణయాన్ని తన స్నేహితులు..బంధువులు స్వాగతించారని చెప్పారు.