Covid politcs మోదీపై ద్వేషమెందుకు? ఓవైసీని నిలదీసిన ముస్లిం నేత

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై నిప్పులు చెరిగారు ఓ ముస్లిం నేత. ఏపీకి చెందిన ముస్లిం నేత మోదీపై మీకెందుకు అంత ద్వేషం అంటూ ఓవైసీని నిలదీశారు.

Covid politcs మోదీపై ద్వేషమెందుకు? ఓవైసీని నిలదీసిన ముస్లిం నేత
Follow us

|

Updated on: Apr 04, 2020 | 11:39 AM

Muslim leader questions Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై నిప్పులు చెరిగారు ఓ ముస్లిం నేత. ఏపీకి చెందిన ముస్లిం నేత మోదీపై మీకెందుకు అంత ద్వేషం అంటూ ఓవైసీని నిలదీశారు. దేశమంతా ఒక్కటై కరోనా వైరస్ నియంత్రణకు యుద్ధం చేస్తుంటే ఓవైసీకి ఎందుకు ఇంత బాధ అని ప్రశ్నించారు ఏపీ ముస్లిం లీడర్ ఒకరు.

ఓవైసీకి ముస్లింల పట్ల అంతప్రేమ ఉంటే ముస్లిం పేదలకు ఆహార కేంద్రాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు ఏపీ బీజేపీకి చెందిన జాతీయ మైనారిటీ మోర్చ కార్యదర్శి షేక్ బాజీ. ఓవైసీ తన సొంత హాస్పిటల్‌ను కరోనా క్వారరెంటైన్ గాను, ఐసొలేషన్ వార్డులుగాను మార్చి వైరస్ బారిన పడిన పేద ముస్లింలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా వ్యాధిపై ముస్లింలలో అవగాహన కల్పించకుండా వారిని రెచ్చగొడుతున్న ఓవైసీ తన తీరును మార్చుకోవాలని షేక్ బాజీ సూచించారు.

సమాజంలో మత విద్వేషాలు సృష్టించి ముస్లింలను విడదీయాలనుకొంటున్నాడు ఓవైసీ అని ఆరోపించిన షేక్ బాజీ.. రాజకీయం వేరు జాతి విపత్తు వేరు అన్న సత్యాన్ని గుర్తించాలని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయం చేయాలని చూస్తే భారతీయ ముస్లింలు ఓవైసీకి తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. చికిత్సకు సహకరించకుండా వైరస్ ప్రబలడానికి కారణమవుతున్న వారిని ఓవైసీ వంటి వారు ఎడ్యుకేట్ చేయాలని, అలాంటి తన బాధ్యతను మరిచి నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని షేక్ బాజీ.. ఓవైసీకి వార్నింగ్ ఇచ్చారు.

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్