మసీదులో మ్యూజిక్ వీడియో.. నటి, సింగర్‌లపై కేసు నమోదు

పాకిస్తాన్ నటి సబా ఖమర్‌, సింగర్‌ బిలాల్‌ సయీద్‌లపై లాహోర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మసీదులో మ్యూజిక్‌ వీడియోను తెరకెక్కించినందుకు గానూ పవిత్రతను ఉల్లంఘించారంటూ

మసీదులో మ్యూజిక్ వీడియో.. నటి, సింగర్‌లపై కేసు నమోదు
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2020 | 5:53 PM

Case against Pakistan Actor: పాకిస్తాన్ నటి సబా ఖమర్‌, సింగర్‌ బిలాల్‌ సయీద్‌లపై లాహోర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మసీదులో మ్యూజిక్‌ వీడియోను తెరకెక్కించి దాని పవిత్రతను దెబ్బతీశారని.. దైవ దూషణ చట్టం కింద ఈ ఇద్దరిపై కేసు నమోదైంది. ఇటీవల ఈ ఇద్దరు లాహోర్‌లోని వజీర్‌ ఖాన్‌ మసీదులో  ఓ వీడియోను చేయగా.. అందులోని ఓ క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వారిపై దైవ దూషణ చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు. పాకిస్తాన్ మీడియా ప్రకారం.. వారిద్దరితో పాటు ఈ వీడియో తీయడంలో భాగమైన వారిపైన న్యాయవాది సర్దార్ ఫర్హత్‌ మజూర్ ఖాన్ ఆగష్టు 13న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.

కాగా దీనిపై సబా ఖమర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. తాము తెరకెక్కించిన ‘ఖబూల్’‌లో ఒకే ఒక్క సీన్‌ని వాజిర్ ఖాన్ మసీదులో షూట్ చేశామని అన్నారు. ఈ సన్నివేశం వచ్చినప్పుడు మేము మ్యూజిక్‌ని ప్లే చేయలేదు. మ్యూజిక్ ట్రాక్‌తో కూడా ఎడిట్ చేయలేదు. సోషల్ మీడియాలో వైరల్‌ అయిన వీడియో ఖబూల్‌ పోస్టర్‌ల కోసం తీసింది అని కామెంట్ పెట్టారు.

Read More:

ఈ ఏడాదిలో రెండుసార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

మాధవన్‌ని ‘కిస్’‌ చేయాలంటే చిన్నపాటి గుండెపోటు వచ్చింది