Breaking News
  • రంగారెడ్డి: తక్కుగూడ దగ్గర రోడ్డు ప్రమాదం. డివైడర్‌ను ఢీకొన్న మార్బుల్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ. ఒకరు మృతి, ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతోనే డివైడర్‌ను ఢీకొన్న లారీ.
  • మేడ్చల్‌: ఘట్‌కేసర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం. విద్యార్థులపైకి దూసుకెళ్లిన బస్సు. పలువురు విద్యార్థులకు గాయాలు. బస్సు డ్రైవర్‌ను చితకబాదిన విద్యార్థులు. ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
  • మణిపూర్‌ అసెంబ్లీ ఎదుట భారీ పేలుడు. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • రంగారెడ్డి: తక్కుగూడ దగ్గర రోడ్డు ప్రమాదం. డివైడర్‌ను ఢీకొన్న మార్బుల్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ. ఒకరు మృతి, ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతోనే డివైడర్‌ను ఢీకొన్న లారీ.
  • పార్టీ మారతారన్న వార్తలపై స్పందించిన మంత్రి ఈటల. నేను పార్టీ మారను-మంత్రి ఈటల. గాలి వార్తలపై నేను స్పందించను. చెప్పే వాళ్లు ఎన్నైనా చెప్తారు-మంత్రి ఈటల.
  • సుజనాచౌదరి వ్యాఖ్యలకు మంత్రి మోపిదేవి కౌంటర్‌. గోడ దూకే ఎంపీలెవరూ వైసీపీలో లేరు. జగన్‌పై ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. తిరుమలను ఆర్ధిక వనరుగా భావించే ఆలోచన ప్రభుత్వానికి లేదు -మంత్రి మోపిదేవి వెంకటరమణ.

పాటపై రగడ..లిరిక్స్ కూనీ చేస్తున్నాడని సిద్‌పై..కళ్యాన్ మాలిక్ ఫైర్

Kalyani Malik Takes A Dig At Young Sensation Sid Sriram, పాటపై రగడ..లిరిక్స్ కూనీ చేస్తున్నాడని సిద్‌పై..కళ్యాన్ మాలిక్ ఫైర్

సదరన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న మూవీ ‘అల వైకుంఠపురంలో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలోని ‘సామజవరగమన’ అనే పాటను చిత్రబృందం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.  తన మెలోడియస్ వాయస్‌తో గత కొంతకాలంగా యూత్‌ను మెస్మరైజ్ చేసిన సిద్ శ్రీరామ్‌ ఈ పాటను ఆలపించారు. ‘నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు..’ అంటూ సాగుతున్న ఈ పాట వినడానికి ఎంతో క్లాసిక్‌గా అనిపిస్తుంది. అలా రిలీజ్ చేసిన వెంటనే సాంగ్ యూత్‌లోకి చొచ్చుకుపోయింది. ఇక లెజెండ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం పాట స్థాయిని మరో ఎత్తుకు తీసుకెళ్లింది.

అయితే ఈ పాటపై తాజాగా వివాదం రాజుకుంది. సిద్ శ్రీరామ్ లిరిక్స్‌ను కూనీ చేస్తున్నాడంటూ ఫైరయ్యారు క్లాసికల్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ కళ్యాన్ మాలిక్. అతడిని ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో ఫోస్ట్ చేశాడు.  ‘నువ్వు పాటలోని పదాలను పలికిన తీరుకు చప్పట్లు కొడుతున్నాను. ఇప్పుడు నువ్వు స్టార్ సింగర్‌వి కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ నువ్వు ‘మహా ప్రసాదం’ అన్న పదాన్ని తప్పుగా పలికినప్పటికీ నిన్ను సింగర్‌గా పెట్టుకున్నారు. అందుకు ఆయన్ను అభినందిస్తున్నాను. ఇక లిరిక్స్‌కు నేను నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కామెంట్ చేసిన కొద్దిసేపటికే ఆయన పోస్ట్ డిలీట్ చేశారు.

కాగా కళ్యాన్ మాలిక్ వ్యాఖ్యలపై నెటిజన్లు, శ్రోతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు సిద్దు శ్రీరామ్‌కు వంతపాడగా..మరికొందరు కళ్యాన్ మాలిక్‌కు మద్దతుగా నిలిచారు. కాగా కళ్యాన్ మాలిక్‌కి అవకాశాలు రాకపోవడంతో..వార్తల్లో నిలవడానికి ఇలా చేస్తున్నారని కొందరు వాదన. కళ్యాన్ మాలిక్..నిజానికి ఎక్సలెంట్ మ్యూజిక్ డైరక్టర్. నార్మల్‌గా ఉన్న లిరిక్స్‌ని కూడా తన మ్యూజిక్‌తో మరో స్థాయికి తీసుకెళ్తారు. మనసును హత్తుకునేలా ఆయన సాంగ్స్ ఉంటాయి. ఎప్పుడూ వివాదరహితుడిగా ఉంటే ఆయన..ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే కాస్త ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందనేది చాలామంది ఫిలిం సర్కిల్స్‌లో ఉండేవారి వాదన.