Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

మళ్లీ అదే తప్పు చేస్తోన్న ప్రభాస్ టీమ్..!

ఇటీవల సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి మూవీ తరువాత ప్రభాస్ నటించిన ఈ చిత్రంపై అందరు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే వారి అంచనాలను అనుకున్నంత మేర అందుకోలేకపోయింది సాహో. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర కథ పాతది కావడం.. స్క్రీన్‌ప్లే గజిబిజీ ఉండటంతో అన్ని వర్గాలను ప్రభాస్ మెప్పించలేకపోయాడు. ఇక ఈ మూవీకి మైనస్‌గా మారిన వాటిలో మ్యూజిక్ కూడా ఒకటి. బాలీవుడ్‌కు తగ్గట్లుగా ఈ మూవీలోని పాటలు ఉండగా.. దక్షిణాది ప్రేక్షకులను సాహో ఆల్బమ్ ఆకట్టుకోలేకపోయింది.

అయితే ఈ మూవీకి మొదటగా సంగీత దర్శకులుగా బాలీవుడ్ త్రయం శంకర్- ఇషాన్- లాయ్‌ను ఎంచుకున్న టీమ్.. అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. కానీ ఈ సినిమా కోసం తమకు తెలియకుండా దర్శకనిర్మాతలను వేరే వారితో పాటలను చేయించుకున్నారని ఆరోపించిన ఈ త్రయం.. ఈ మూవీ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అది కూడా మూవీ విడుదల తేదీ దగ్గరపడుతోన్న సమయంలో.. వారు ఈ ప్రాజెక్ట్‌ నుంచి బయటకు వచ్చేశారు. ఇక చేసేదేం లేక బాలీవుడ్‌కు చెందిన తనిష్క్ బాగ్చీ, గురు రాద్వా, బాద్‌ షా‌లతో ఒక్కో పాటను చేయించుకున్నారు సాహో టీమ్. అలాగే శంకర్-ఇషాన్- లాయ్ అనుమతితో వారు చేసిన ఓ పాటను ఇందులో పెట్టుకున్నారు. అయితే పాటలను పక్కనబెడితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు గిబ్రాన్‌‌ను ఎంచుకోగా.. అందులో మాత్రం అతడికి మంచి మార్కులు పడ్డాయి. మొత్తానికి సాహోకు సంగీతం మైనస్‌గా మారింది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ రొమాంటిక్ ప్రేమ కథలో నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపీక‌ృష్ణ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 30శాతానికి పైగా కంప్లీట్ అయ్యింది. అయితే ఇంతవరకు ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఖరారు కాలేదు. కనీసం ఈ సినిమాకు పలనా దర్శకుడు పనిచేయబోతున్నాడంటూ పుకార్లు కూడా రాలేదు. దీంతో ప్రభాస్ టీమ్ మళ్లీ అదే తప్పు చేస్తుందా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సినిమాకు కథ, కథనం, నటీనటులు ఎంత అవసరమో సంగీతం కూడా అంతే అవసరం. అందుకే చాలా మంది దర్శకులు తాము తెరకెక్కించే సినిమాలకు మొదట్లోనే మ్యూజిక్ డైరక్టర్‌లను ఎంపిక చేసుకుంటారు. ఇలా చేయడం వలన టాకీ షూటింగ్‌తో పాటు పాటలను చిత్రీకరించొచ్చని.. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం కేటాయించవచ్చని భావిస్తుంటారు. కానీ ప్రభాస్ టీమ్ మాత్రం సంగీత దర్శకుడిని ఇంకా ఎంపిక చేయకపోవడం గమనర్హం. ఇప్పటికీ మ్యూజిక్ డైరక్టర్‌ను ఎంచుకోకపోతే.. మళ్లీ సాహోకు జరిగినట్లుగానే.. చివర్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు భావిస్తున్నారు.  మరి ప్రభాస్ తదుపరి చిత్రానికి సంగీత దర్శకుడిని ఎప్పుడు ఖరారు చేస్తారు..? ప్రభాస్ మూవీకి ఛాన్స్ కొట్టే మ్యూజిక్ డైరక్టర్ ఎవరు..? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.