హ్యాట్సాఫ్ సుప్రీమ్ హీరో.. మ్యూజిక్ డైరెక్టర్‌ను కాపాడిన సాయి తేజ్!

Music Director Achu Met With An Accident, హ్యాట్సాఫ్ సుప్రీమ్ హీరో.. మ్యూజిక్ డైరెక్టర్‌ను కాపాడిన సాయి తేజ్!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. షూటింగ్ ముగించుకుని ఇంటి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కార్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాడు. వివరాల్లోకి వెళ్తే నానక్‌రాంగూడ రామానాయుడు స్టూడియోలో షూటింగ్ పూర్తి చేసుకుని సాయి ధరమ్ తేజ్‌ ఇంటికి వస్తున్నాడు. ఇక అదే సమయంలో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.42 మూలమలుపు వద్ద ఓ వ్యక్తి ద్విచక్రవాహనం అదుపు తప్పి కారును ఢీకొట్టింది. అటుగా వెళ్తున్న సాయి వెంటనే కారు ఆపి చూడగా.. ప్రమాదానికి గురైన వ్యక్తి తన స్నేహితుడు, సంగీత దర్శకుడు అచ్చు అని గుర్తించి వెంటనే తన కారులో సమీపంలో ఉన్న అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కాగా ఈ ప్రమాదంలో అచ్చు కాలికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కాగా గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ కొన్ని సందర్భాలలో తనలోని మానవత్వాన్ని చాటుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *