పాక్‌ను భారత్ టచ్ కూడా చేయలేదు: ముషారఫ్

ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య వాతావరణం వేడెక్కుతోంది. అసలు యుద్ధం సంగతి పక్కన పెడితే మాటల యుద్ధం మాత్రం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో ఐదు పాయింట్లు ఉన్నాయని, అందులో నాలుగింటిని భారత్ టచ్ కూడా చేయలేదని అన్నారు. పుల్వామా దాడిని తాను ఖండిస్తున్నానని చెబుతూ, దాడిలో పాకిస్థాన్ ప్రమేయం ఉందంటూ చేస్తున్న […]

పాక్‌ను భారత్ టచ్ కూడా చేయలేదు: ముషారఫ్
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 7:49 PM

ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య వాతావరణం వేడెక్కుతోంది. అసలు యుద్ధం సంగతి పక్కన పెడితే మాటల యుద్ధం మాత్రం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో ఐదు పాయింట్లు ఉన్నాయని, అందులో నాలుగింటిని భారత్ టచ్ కూడా చేయలేదని అన్నారు.

పుల్వామా దాడిని తాను ఖండిస్తున్నానని చెబుతూ, దాడిలో పాకిస్థాన్ ప్రమేయం ఉందంటూ చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. దాడి జరిగిన మరుసటి రోజే పాక్‌ను భారత్ తప్పుబట్టడం సరికాదని, ఘటన జరిగిన గంటల్లోనే అసలెలా తప్పుబడతారని ప్రశ్నించారు. పుల్వామా దాడికి తామే బాధ్యులమని ప్రకటించిన జైషే ఉగ్రవాద సంస్థను పాక్ ఉపేక్షించదన్నారు.

జైషేపై నిషేధం విధించాలని, ఆ సంస్థ చీఫ్ మసూద్‌పై తమకేమాత్రం సానుభూతి లేదని ముషారఫ్ స్పష్టం చేశారు. పుల్వామా దాడిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ హస్తం లేదని ఆయన వెల్లడించారు. భారత్‌లో ‘ఉరి’ ఘటన తరువాత పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ సర్జికల్ దాడులు జరిపిందనడంలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. పాక్‌పై దాడులు చేస్తామని భారత్ హెచ్చరిస్తే కనుక తనే దారుణంగా నష్టపోతుందన్నారు.