Breaking News
  • కర్నూలు: ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్‌. పగుళ్లు వచ్చి డ్యామ్‌ ప్రమాదంలో ఉందని రాజేంద్రసింగ్‌ హెచ్చరిక. పగుళ్లతో వాటర్‌ లీకేజీలు ఎక్కువగా ఉన్నాయన్న రాజేంద్రసింగ్‌. గంగాజల్‌ సాక్షరత యాత్రలో భాగంగా శ్రీశైలం డ్యామ్‌ పరిశీలన. ప్రధాన డ్యామ్‌ ఎదురుగా భారీ గొయ్యి ఏర్పడింది. డ్యామ్‌ గేట్లు ఎత్తిన ప్రతీసారి మరింత పెద్దదవుతుంది. ఆ గొయ్యి విస్తరిస్తూ డ్యామ్‌ పునాదుల వరకు వెళ్తోంది. చాలా కాలం నుంచి లీకేజీలు వస్తున్నా పట్టించుకోలేదు. డ్యామ్‌ నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రమాదంగా మారింది.
  • శ్రీశైలం డ్యామ్‌కు పగుళ్లు వాస్తవమేనంటున్న అధికారులు. పరిస్థితిపై ప్రభుత్వానికి వివరించాం. డ్యామ్‌ కొట్టుకుపోయేంత ముప్పులేదంటున్న అధికారులు.
  • కాకినాడ: వైద్యం వికటించి యువకుడి పరిస్థితి విషమం. కడుపు నొప్పి రావడంతో ఫౌండేషన్‌ ఆస్పత్రిలో చేరిన యువకుడు. మూడు రకాల ఇంజెక్షన్‌లు చేసిన ఆస్పత్రి వైద్యులు. యువకుడి పరిస్థితి విషమించడంతో ట్రస్ట్‌ ఆస్పత్రికి తరలింపు.
  • కొలిక్కి రాని మహారాష్ట్ర పంచాయితీ. ముంబైలో నేడు వేర్వేరుగా కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతల సమావేశం.
  • కొమురంభీంఆసిఫాబాద్‌: కాగజ్‌నగర్‌లో దారుణం. తల్లి సంధ్య గొంతు కోసిన కొడుకు. తల్లి పరిస్థితి విషమం, మంచిర్యాల ఆస్పత్రికి తరలింపు. అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న సంధ్య.
  • ప్రకాశం: అద్దంకిలో రెండు ఇళ్లలో చోరీ. 7 సవర్ల బంగారం, రూ.10వేల నగదు, 2 సెల్‌ఫోన్లు అపహరణ.
  • నేడు జనగామ, మహబూబాద్‌ జిల్లాల్లో మంత్రి ఎర్రబెల్లి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు.
  • చిత్తూరు: రామకుప్పం మండలం ననియాలతండాలో దారుణం. వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి రవి అనే వ్యక్తి మృతి. రవి మృతదేహాన్ని రహస్యంగా కాల్చివేసిన వేటగాళ్లు. రవిని హత్య చేశారంటున్న ననియాల గ్రామస్తులు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. ననియాల, ననియాలతండా గ్రామాలలో ఉద్రిక్తత.

కేసుల నుంచి బయటపడేందుకే.. పార్టీలు మారుతున్నారు: మురళీధర్ రావు

Muralidhar Rao Sensational Comments On Jumping Leaders, కేసుల నుంచి బయటపడేందుకే.. పార్టీలు మారుతున్నారు: మురళీధర్ రావు

రాష్ట్రంలో టీడీపీ నుంచి చాలామంది నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలైందని అన్నారు. ఇక భవిష్యత్తులో కూడా టీడీపీకి గెలిచే అవకాశం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు కమలం గూటికి చేరేందుకు చర్చలు జరిపారని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని తెలుస్తోంది. ఇక త్వరలో ఏపీలో కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు. అంతేకాదు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వస్తున్న నేతలపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే చాలా మంది బీజేపీలోకి వస్తున్నారని అన్నారు.

ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో ఇచ్చి పుచ్చుకోవటాలు మామూలయ్యాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైన కేసులో ఇరుక్కున్నవారు వాటి నుంచి తప్పించుకోవడానికి పార్టీలు మారుతున్నారు. తాజాగా యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ ఉన్నట్టుండి బీజేపీలోకి జెంప్ చేశారు. అయితే ఆయన పార్టీ మార్పు పై మురళీధర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన బాబ్రీ మసీదు కేసు నుంచి తప్పించుకునేందుకే కమలం గూటికి వచ్చారని అన్నారు. బీజేపీలో చేరితే కేసుల నుంచి విముక్తి కలుగుతుందనే భ్రమలు ఎవ్వరూ పెట్టుకోవద్దనీ.. అలాంటి ఆశతో పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తే అది వృథా అవుతుందని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. ఐటీ దాడులకు.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారాయన.