Breaking News
  • కడప: వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్‌ రాజీనామా చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు-ఆదినారాయణరెడ్డి.
  • రేపు పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయం సందర్శించనున్న పవన్‌. అమరవీరుల సంక్షేమానికి రూ.కోటి అందించనున్న పవన్‌.
  • కృష్ణాజిల్లా: చందర్లపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. పక్కా ఇళ్ల స్థలాలకు తన పొలంలో మట్టి తవ్వుతున్నారని మనస్తాపం. పురుగులమందు తాగబోయిన రైతు, అడ్డుకున్న సిబ్బంది.
  • ప.గో: తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థి మృతి. బైక్‌పై నుంచి పడి మృతిచెందాడంటున్న తండ్రి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
  • హైదరాబాద్: మిస్టరీగా మారిన ఆయుష్‌ చాన్‌ బే మృతి, ఈనెల 16న స్నేహితుడి పుట్టిన రోజు అని వెళ్లిన ఆయుష్‌, నిన్న రక్తపు మడుగులో శవమై తేలిన ఆయుష్‌, ఆయుష్‌పై మృతిపై అనుమానాలు.
  • విజయవాడ: అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారిక అనుమతులపై లోతైన విచారణ. అక్రమంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలకు సిఫారసు.

తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికలు!

Municipal elections ended in Telangana, తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికలు!

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. 5 గంటలవరకు క్యూలో ఉన్నవారికి మాత్రం ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా పురపాలక పోరు జరిగింది. రాష్ట్రంలోని 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహించారు. అలాగే 2,647 వార్డులు, 382 డివిజన్లలో పోలింగ్‌ జరిపారు. మొత్తం 12,843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

అభ్యర్థులు, కార్పొరేటర్లు పోటాపోటీగా ఎన్నికల కోసం ఖర్చు చేశారు. కోట్లు చేతులు మారాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న నేతలు ఓటుకు 5వేలకు పైగా ముట్టచెప్పినట్టు తెలుస్తోంది. ఏకగ్రీవమైన వార్డులు, డివిజన్లను మినహాయించి మిగతా వాటికి పోలింగ్‌ జరిపారు. ఒక్క కరీంనగర్‌ కార్పొరేషన్లో మాత్రం ఈనెల 24న పోలింగ్‌ జరగనుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కార్మికులు, ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Related Tags