ముగ్గురికి ముళ్ళ పరీక్ష.. వ్యూహం ఇదే!

తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు మూడు రాజకీయ పార్టీలకేమో గానీ ముగ్గురు ఎంపీలకు పరీక్షగా మారాయంటున్నరు తెలంగాణ బీజేపీ వర్గాలు. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఎంపీలుగా గెలిచిన నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎంపీలకు ఇప్పుడు వారివారి నియోజకవర్గాల పరిధిలో వున్న మునిసిపాలిటీలలో బిజెపిని గెలిపించుకోవడం సవాల్‌గా మారింది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో వారి జోరుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కుదేలయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. దాంతో వారికి మునిసిపల్ ఎన్నికలుపరీక్షగా మారాయి. బండి సంజయ్‌… కరీనంగర్‌లో […]

ముగ్గురికి ముళ్ళ పరీక్ష.. వ్యూహం ఇదే!
Follow us

|

Updated on: Dec 31, 2019 | 8:15 AM

తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు మూడు రాజకీయ పార్టీలకేమో గానీ ముగ్గురు ఎంపీలకు పరీక్షగా మారాయంటున్నరు తెలంగాణ బీజేపీ వర్గాలు. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఎంపీలుగా గెలిచిన నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎంపీలకు ఇప్పుడు వారివారి నియోజకవర్గాల పరిధిలో వున్న మునిసిపాలిటీలలో బిజెపిని గెలిపించుకోవడం సవాల్‌గా మారింది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో వారి జోరుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కుదేలయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. దాంతో వారికి మునిసిపల్ ఎన్నికలుపరీక్షగా మారాయి.

బండి సంజయ్‌… కరీనంగర్‌లో ఎమ్మెల్యేగా ఓడి, ఎంపీగా గెలిచారు. ధర్మపురి అరవింద్.. నిజామాబాద్‌లో ఏకంగా కేసీఆర్ కూతురు కవితను ఓడించారు. సోయం బాపురావు.. ఆదీవాసీల సత్తా ఏంటో చాటి పార్లమెంటు మెట్లెక్కారు. ఈ ముగ్గురు ఎంపీలు పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచారు. ప్రస్తుతం వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లో మున్సిపల్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున మెజార్టీ సీట్లు గెలవాలనేది వీరికి అధిష్టానం ఇచ్చిన టార్గెంట్.

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ ముగ్గురి పర్సనల్‌ ఎజెండా నరేంద్ర మోదీ చరిష్మా జతవ్వడంతో విజయం సాధించారనే వాదన ఉంది. దీంతో ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి…తమ సత్తా చాటాలని ఈ నేతలు భావిస్తున్నారట. ఈ ఎన్నికలు కరీంనగర్‌ ఎంపీ సంజయ్‌కు కీలకంగా మారాయి. మోదీ హవాకు తనపై వున్న సింపతీ తోడవ్వడంతో సంజయ్ కరీంనగర్‌ ఎంపీగా విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఇప్పుడు జరిగే మున్సిపల్‌ ఎన్నికలోనైనా సత్తా చాటాలని సంజయ్‌ భావిస్తున్నారు.

గత మున్సిపల్‌ ఎన్నికల్లో వేములవాడ మినహా ఎక్కడ బీజేపీ పెద్దగా సీట్లు సాధించలేదు. కౌన్సిలర్‌ నుంచి ఎంపీగా విజయం సాధించిన సంజయ్‌పై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేస్తామన్న ధీమా బీజేపీలో కనిపిస్తోంది.

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌కి మొన్నటి ఎన్నికల్లో కాలం కలిసివచ్చింది. పసుపు బోర్డు విషయం తేలకపోవడంతో ఇపుడు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో ఈ సారి ఆయన లోకల్‌ సెంటిమెంట్ ప్లే చేసే పనిలో పడ్డారు. కార్పొరేషన్‌ గెలిస్తే నిజామాబాద్‌ పేరు మారుస్తామని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సారి ఈ లోకల్‌ సెంటిమెంట్‌ అరవింద్‌కు కలిసి వస్తుందా? లేదా? అనేది చూడాలి.

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తుడుందెబ్బ అధ్యక్షుడు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నుండి బీజేపీకి మారిన ఆయన…ఆదివాసీ సెంటిమెంట్‌తో ఎంపీ అయ్యారు. ఖానాపూర్‌, బోథ్‌, ఆసిఫాబాద్‌లో బలమైన ఓటు బ్యాంక్‌ సోయం సొంతం. లోకల్‌ ఎలక్షన్స్‌లో పట్టుమని పది సీట్లు కూడా బీజేపీ గెలవలేకపోయింది. అయితే ఈ సారి మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని సోయం బాపురావు ప్రయత్నిస్తున్నారు.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు