ముంబయి మారణకాండ సూత్రధారి హఫీజ్ సయీద్ కు పదేళ్ల జైలు శిక్ష విధించిన పాకిస్థాన్ కోర్టు

ముంబయి మారణకాండ సూత్రధారి హఫీజ్ సయీద్ కు పాకిస్థాన్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 26/11 ముంబయి దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా (జేయూడీ) ఉగ్రవాద భావజాల సంస్థ అధిపతి అయిన హఫీజ్ సయీద్ కు ఈ మేరకు శిక్షపడింది. ఉగ్రవాద సంస్థలకు నిధులకు సంబంధించిన ఓ కేసులో తీవ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు 1,10,000 పాకిస్తాన్ రూపాయల జరిమానా కూడా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. […]

  • Venkata Narayana
  • Publish Date - 5:15 pm, Thu, 19 November 20
ముంబయి మారణకాండ  సూత్రధారి హఫీజ్ సయీద్ కు  పదేళ్ల జైలు శిక్ష విధించిన పాకిస్థాన్ కోర్టు

ముంబయి మారణకాండ సూత్రధారి హఫీజ్ సయీద్ కు పాకిస్థాన్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 26/11 ముంబయి దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా (జేయూడీ) ఉగ్రవాద భావజాల సంస్థ అధిపతి అయిన హఫీజ్ సయీద్ కు ఈ మేరకు శిక్షపడింది. ఉగ్రవాద సంస్థలకు నిధులకు సంబంధించిన ఓ కేసులో తీవ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు 1,10,000 పాకిస్తాన్ రూపాయల జరిమానా కూడా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ కేసులో హఫీజ్ సయీద్ సన్నిహితుడు అబ్దుల్ రహమాన్ మక్కీకి కోర్టు 6 నెలల కారాగార శిక్ష విధించింది. గత వారం జరిపిన విచారణలో జమాత్ ఉద్ దవాకు చెందిన మాలిక్ జాఫర్, యాహ్యా ముజాహిద్ లకు 16 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2019లో నిధులకు సంబంధించిన ఆరోపణలపై పాకిస్తాన్ కు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ (సీటీడీ) జమాత్ ఉద్ దవా నాయకులపై కేసులు నమోదు చేసింది. నిషిద్ధ సంస్థకు చెందిన ఆస్తుల నిర్వహణ, నిధుల సేకరణ ద్వారా ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేశారంటూ వీరిపై సీటీడీ చార్జిషీటు దాఖలు చేయడంతో ఈ మేరకు తీర్పు వెలువరించింది.