Breaking News
  • భారత్ దేశంలో 6 లక్షలు దాటినా కరోనా పాజిటివ్ కేసులు. గడిచిన ఐదు రోజుల్లోనే లక్ష కేసులు నమోదు. జూన్ నెలలో 4 లక్షల కేసులు,12 వేలకు పైగా మరణాలు. దేశవ్యాప్తంగా ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు,18 వేలకు చేరువలో మరణాలు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 19,148 కేసులు, 434మంది మృతి. దేశవ్యాప్తంగా 6,04,641 కేసులు,17,834 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,26,947 యాక్టీవ్ కేసులు, 3,59,860 మంది డిశ్చార్జ్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విజయవాడ: కోవిడ్ ఆసుపత్రి నుంచి వసంతరావు అనే వృద్దుడు అదృశ్యం. వారం అయినా ఆచూకీ లభించక పోవడంతో ఆందోళనలో కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వసంతరావు అదృశ్యం అయ్యాడంటున్న కుటుంబ సభ్యులు.
  • అమరావతి: హైకోర్టు ను ఆశ్రయించిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. తనని హాస్పిటల్ కి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం. రేపు విచారించనున్న న్యాయస్థానం.
  • యూపీ ఢిల్లీ హర్యానా ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించనున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. కరోనా మహమ్మారిపై సమీక్ష.
  • పీవీ 100 వ పుట్టినరోజు జ్ఞాపకార్థం తపాలా స్టాంపులకు అనుమతి ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన కిషన్ రెడ్డి. 100 వ జన్మదినోత్సవం సందర్భంగా తపాలా స్టాంపును విడుదల చేయాలన్న నా అభ్యర్థనను అంగీకరించినందుకు మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ మరియు గౌరవప్రదమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి నేను వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ స్టాంప్‌ను భారత ప్రభుత్వ పోస్టుల శాఖ త్వరలో విడుదల చేస్తుంది.
  • టీవీ9 తో గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ భగవంత రావు. గణపతి ఉత్సవాలు ఎప్పటి లాగే జరుగుతాయి అనుకుంటున్నాం. ఈ నెల 31 తరువాత ఉత్సవాలపై నిర్ణయం తీసుకుంటాం. అప్పటి పరిస్థితి ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. రాజా సింగ్ మాటలు వ్యక్తిగత మైనవి. రాజకీయ మైలేజ్ కోసం అలాంటి వ్యాఖ్యలు ఉంటాయి. ముంబై పరిస్థితి వేరు మన పరిస్థితి వేరు. ఇళ్లలో చేసే గణపతి పూజలు యధావిధిగా జరుగుతాయి. సామాజిక ఉత్సవాలు మాత్రం పరిస్థితిలకు అనుగుణంగా జరుపుతాం. ఉత్సవాలు జరపడనికే సిద్ధ మవండి అప్పటి పరిస్థితి ని బట్టి నిర్వహించుకుందాం.
  • విజయవాడ రాష్ట్రంలో “అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్(APCOS)" ఏర్పాటు. అవుట్ సోర్సింగ్ నియామకాలకోసం అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్(APCOS)" శుక్రవారం (జులై 3 న) లాంఛనంగా ముఖ్యమంత్రి శl వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. ఉద్యోగం కోసం లంచాలు, కమీషన్లు ఇవ్వనక్కరలేదు. దళారులను ఆశ్రయించనక్కరలేదు. ఈ.ఎస్.ఐ , ఈ.పీ.ఎఫ్ సౌకర్యా లు సక్రమంగా అమలు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకే ఎస్.సి. ఎస్.టి. బి.సి. మైనారిటీ అభ్యర్థులకు 50 శాతం రిజెర్వేషన్లు.

రైలు వచ్చింది రమ్మన్నారు.. తీరా లేదు పొమ్మన్నారు..!

Mumbai Railway Police department miscommunication train cancel migrant workers strugles, రైలు వచ్చింది రమ్మన్నారు.. తీరా లేదు పొమ్మన్నారు..!

లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక అవస్థలు పడ్డారు. దీంతో సొంతూర్లకు వెళ్లేందుకు రైలు వేస్తున్నాం రామన్నారు ఒకరు. తీరా వెళ్లాక రైలు లేదు పొమ్మన్నారు మరోకరు. డబ్బులేని కాలంలో కింద మీద పడి రైల్వే స్టేషన్ కి చేరిన వారికి నిరాశే ఎదురైంది. అధికారుల సమన్వయ లోపంతో దిక్కుతోచనిస్థితిలో పడ్డారు ముంబై వలస కార్మికులు.
కరోనా దెబ్బకి వలసకూలీలు విలవిలలాడుతున్నారు. స్వస్ధలాలకు చేరేందుకు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ముంబై నుంచి తమ గ్రామాలకు వెళ్లేందుకు శుక్రవారం రైళ్ల కోసం వేచిచూసిన వేలాది మంది వలస కూలీలకు అధికారుల మధ్య సమన్వయ లోపం నిరాశపర్చింది. వలస కూలీలు వెళ్లాల్సిన రైలు బొరివలి స్టేషన్‌ నుంచి బయలుదేరుతుందని సమాచారం ఇచ్చారు ముంబై పోలీసులు. అందరూ కందివలిలో ప్రభుత్వ మైదానానికి చేరుకోవాలని సూచించారు. దీంతో వ్యయప్రయాసలకు ఒడ్చి ఆ ప్రాంతానికి చేరుకున్న వలస కార్మికులకు నిరాశే ఎదురైంది. యూపీకి వెళ్లాల్సిన రైళ్లు రద్దయ్యాయని మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. మరోవైపు రైళ్లు ఏవీ రద్దవలేదని రైల్వే అధికారులు చెప్పడం వలస కూలీలను అయోమయంలో పడేసింది. అధికారుల నిర్వాకంతో వలస కూలీలు భగ్గుమన్నారు. తమ వద్ద చేతిలో చిల్లిగవ్వ లేదని ఇక్కడ నుంచి తిరిగి ఎలా వెళతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైలు దొరికేవరకూ రైల్వేస్టేషన్‌లోనే ఉంటామంటూ భీష్మించారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో.. అధికారుల మధ్య సమన్వయం కొరవడటంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Related Tags