‘సుప్రీం’ ఉత్తర్వు కాపీ అందాక ఏం చేయాలో ఆలోచిస్తాం’, ముంబై పోలీసులు

సుశాంత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ముంబై పోలీసులు ఆచితూచి స్పందించారు. సుశాంత్ మృతిని ముంబై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ గా పరిగణించారని, అందువల్ల వారికి..

'సుప్రీం' ఉత్తర్వు కాపీ అందాక ఏం చేయాలో ఆలోచిస్తాం', ముంబై పోలీసులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 19, 2020 | 6:13 PM

సుశాంత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ముంబై పోలీసులు ఆచితూచి స్పందించారు. సుశాంత్ మృతిని ముంబై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ గా పరిగణించారని, అందువల్ల వారికి దర్యాప్తు విషయంలో పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయని కోర్టు పేర్కొంది. దీనిపై ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు తీర్పు కాపీ వచ్చాక ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టులో తమ లాయర్ ఉన్నారని, ఆయన ఉత్తర్వు తాలూకు కాపీ పంపగానే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.  ఇలా ఉండగా, ఈ కేసులో గత రెండు నెలలుగా మీరు సేకరించిన సాక్ష్యాధారాలు, స్టేట్ మెంట్లను అలాగే యధాతథంగా ఉంచాలని కోరుతూ సీబీఐ ..ముంబై పోలీసులకు లేఖ రాయవచ్ఛునని తెలుస్తోంది.

మరోవైపు శివసేన నేత సంజయ్ రౌత్.. ఈ కేసులో తమ పోలీసుల దర్యాప్తు సజావుగానే ఉందని వ్యాఖ్యానించారు. వారు తమ పని తాము చేశారని ఆయన పేర్కొన్నారు.