పోలీసుల‌పై క‌రోనా పంజా..ఇద్ద‌రు ఏఎస్‌ఐలు మృతి

ఇప్ప‌టికే అనేక మంది పోలీసులు కోవిడ్ బారిన‌ప‌డ‌గా, తాజాగా వారిలో ఇద్దరు ఏఎస్‌ఐలు మృత్యువాత‌ప‌డ్డారు.

పోలీసుల‌పై క‌రోనా పంజా..ఇద్ద‌రు ఏఎస్‌ఐలు మృతి
Follow us

|

Updated on: May 16, 2020 | 1:45 PM

క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపంతో మ‌హారాష్ట్ర చిగురుటాకుల వ‌ణికిపోతోంది. ప్ర‌తిరోజు వంద‌ల సంఖ్య‌లో వైర‌స్ పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌గా పెద్ద సంఖ్య‌లో మ‌ర‌ణాలు కూడా సంభ‌విస్తున్నాయి. మ‌హారాష్ట్రలో అత్యధికంగా 29,100 కరోనా పాజిటివ్‌ కేసులు నవెూదు అయ్యాయి. 1,068 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా ర‌క్ష‌ణ క‌వ‌చాలుగా ప‌నిచేస్తున్న డాక్ట‌ర్లు, పోలీసులు సైతం పెద్ద సంఖ్య‌లో క‌రోనా ప‌డుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే అనేక మంది పోలీసులు కోవిడ్ బారిన‌ప‌డ‌గా, తాజాగా వారిలో ఇద్దరు ఏఎస్‌ఐలు మృత్యువాత‌ప‌డ్డారు.
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. ముంబయి మహానగరాన్ని కోవిడ్ భూతం అతలాకుతలం చేస్తోంది. కరోనాతో ఇద్దరు ఏఎస్‌ఐలు చనిపోయారు. 57 ఏళ్ల అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శుక్రవారం కరోనాతో మృతి చెందాడు. మరో ఏఎస్‌ఐకి కూడా కరోనా పాజిటివ్‌ నిర్దారణ కావడంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్ర‌మంలోనే అతడు బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయాడు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు కరోనాతో 11 మంది పోలీసులు చనిపోగా, 8 మంది ముంబయికి చెందిన వారుగా అధికారులు వెల్ల‌డించారు.