ఎంపీ సంజయ్ రౌత్‌కి బెదిరింపులు.. కంగనా అభిమాని అరెస్ట్..

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అభిమానిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివసేన సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌ను బెదిరించిన కేసులో వ్యక్తిని గురువారం రాత్రి ముంబై పోలీసులు కోల్‌కతాలో అరెస్టు చేశారు.

ఎంపీ సంజయ్ రౌత్‌కి బెదిరింపులు.. కంగనా అభిమాని అరెస్ట్..
Follow us

|

Updated on: Sep 11, 2020 | 5:35 PM

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అభిమానిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివసేన సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌ను బెదిరించిన కేసులో వ్యక్తిని గురువారం రాత్రి ముంబై పోలీసులు కోల్‌కతాలో అరెస్టు చేశారు. దక్షిణ కోల్‌కతాలోని టోలీగంగే ప్రాంతానికి చెందిన పలాశ్‌ బోస్‌ ఇటీవల సంజయ్‌ రౌత్‌కు ఫోన్‌ చేసి తీవ్రంగా బెదిరించాడు. దీంతో కేసు నమోదు చేసిన మంబై పోలీసులు పలాశ్‌ బోస్‌ నివాస ప్రాంతాన్ని గుర్తించి కోల్‌కతా పోలీసుల సాయంతో అరెస్టు చేశారు. ట్రాన్సిట్ రిమాండ్ కోసం అతన్ని కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు.

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అనుమానాస్పద కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు చేయడంపై కంగనా రనౌత్, మహారాష్ట్ర అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చిన కంగనా రనౌత్‌ శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను మహారాష్ట్రకు తిరిగి రావొద్దంటూ సంజయ్‌ రౌత్‌ తోపాటు పలువురు ఆ పార్టీ నాయకులు హెచ్చరించారు. అయితే, ఎంపీ సంజయ్ రౌత్ కి పలాశ్ బోస్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఎంపీతో పాటు మరికొందరు శివసేన నేతలకు ఫోన్ కాల్ చేసి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతన్ని పక్కాగా నిఘా పెట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..