ముంబైలో మళ్ళీ భారీ వర్షాలు.. కారణం ? చెట్లు, పొదల నరికివేతేనా ?

మహారాష్ట్రలో..ముఖ్యంగా రాజధాని ముంబైని మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సుమారు వారం రోజుల క్రితమే వర్షాలు వరదలతో సిటీ సతమతమయింది. ఇప్పుడిప్పుడే తేరుకొంటోందని అనుకుంటే తిరిగి అదే పరిస్థితి పునరావృతమయింది. ఇటీవలి మాదిరే మళ్ళీ భారీ వర్షాలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారుల ఇక్కట్లు సరేసరి ! ఇంతకీ తరచూ ఈ నగరానికి ఎందుకీ సమస్య వఛ్చి పడుతోంది ? అసలు కారణం ఏమిటో విశ్లేషిస్తే.. తడి ప్రాంతాల్లోనూ, […]

ముంబైలో మళ్ళీ భారీ వర్షాలు.. కారణం ? చెట్లు, పొదల నరికివేతేనా ?
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 08, 2019 | 7:37 PM

మహారాష్ట్రలో..ముఖ్యంగా రాజధాని ముంబైని మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సుమారు వారం రోజుల క్రితమే వర్షాలు వరదలతో సిటీ సతమతమయింది. ఇప్పుడిప్పుడే తేరుకొంటోందని అనుకుంటే తిరిగి అదే పరిస్థితి పునరావృతమయింది. ఇటీవలి మాదిరే మళ్ళీ భారీ వర్షాలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారుల ఇక్కట్లు సరేసరి ! ఇంతకీ తరచూ ఈ నగరానికి ఎందుకీ సమస్య వఛ్చి పడుతోంది ? అసలు కారణం ఏమిటో విశ్లేషిస్తే.. తడి ప్రాంతాల్లోనూ, కోస్తా తీరా ప్రాంతాల్లోనూ పెరిగే చిన్న, చిన్న చెట్లు, పొదలను (మడలను) నిర్దాక్షిణ్యంగా నరికివేయడమేనని తేలింది. శతాబ్దాలుగా ముంబైని కాపాడుకుంటూ వస్తున్న వీటిని ఎప్పుడు పడితే అప్పుడు నరికివేస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్-బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు కోసం ఇలా వీటిని నరికివేస్తున్న కారణంగా వర్షపు నీరు సిటీలోకి పోటెత్తుతోంది. ముంబై కార్పొరేషన్ అనాలోచిత చర్యల వల్ల పర్యావరణం కూడా దెబ్బ తింటోంది. బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు కోసం మొత్తం 13. 36 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ చెట్లను తప్పనిసరిగానిర్మూలించవలసి వస్తోందని రాష్ట్ర శాసన మండలిలో ఇటీవల రవాణా శాఖ మంత్రి దివాకర్ రౌటే..శివసేన సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అయితే ఇంతకూ రెట్టింపు హెక్టార్లలో మొక్కలు నాటాలన్నది ప్రభుత్వ ధ్యేయమన్నారు. నిజానికి ముంబై నగరం ఏర్పడక ముందే కోస్తా తీరా ప్రాంతంలో చెట్లు, పొదలు విస్తారంగా పుట్టుకొచ్చాయి. వర్షాల బారి నుంచి సిటీని ఇవి కాపాడుకుంటూ వచ్చాయి. వీటి వల్ల నీరు రోడ్లపైకి ప్రవహించకుండా ఉండేది. వాస్తవానికి వీటి పరిరక్షణ కోసం కోస్టల్ రెగ్యులేషన్ చట్టం, మహారాష్ట్ర ప్రయివేట్ ఫారెస్ట్ యాక్ట్ , వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వంటివి ఉన్నాయి. అయితే ఈ చట్టాల్లోని నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ‘ మడ ‘ ల నరికివేత సాగిపోతూ వచ్చింది. 1972-75 మధ్య కాలంలో మహారాష్ట్ర కోస్టల్ లైన్ లో దాదాపు 200 కి.మీ. మేర చెట్లు, చేమలు విస్తరించి ఉండేవి. కానీ 1997 నాటికి ఇవి 108 కి.మీ. కు తగ్గిపోయాయి. హాలోఫైట్స్ అనే పొదలు నీటిలోని ఉప్పు శాతాన్ని తగ్గిస్తాయని, అలాగే చెట్లు కార్బన్ డై ఆక్సైడ్ ని పీల్చుకుంటూ పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేవని, కానీ బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు కోసం వీటిని నరికివేయడం దారుణమని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుపై పెట్టిన దృష్టి వీటి నాశనానికి కారణమవుతోందని వీరు దుయ్యబడుతున్నారు.

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్