పొలార్డ్ మెరుపులు.. హైదరాబాద్ లక్ష్యం 150 పరుగులు

చివర్లో  పొలార్డ్‌  సిక్సర్లతో విరుచుకుపడటంతో హైదరాబాద్‌కు ముంబై 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 149 పరుగులు చేసింది...

పొలార్డ్ మెరుపులు.. హైదరాబాద్ లక్ష్యం 150 పరుగులు
Follow us

|

Updated on: Nov 03, 2020 | 10:20 PM

చివర్లో  పొలార్డ్‌  సిక్సర్లతో విరుచుకుపడటంతో హైదరాబాద్‌కు ముంబై 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 149 పరుగులు చేసింది.

గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన హిట్‌మ్యాన్‌ , డికాక్‌‌ను సందీప్ శర్మ ప్రారంభంలోనే పెవిలియన్‌కు చేర్చాడు. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి ఇషాన్ కిషన్  ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అడపాదడపా బౌండరీలు సాధిస్తూ స్కోరుబోర్డు ముందుకు తీసుకెళ్లాడు. అయితే షాబాజ్‌ నదీమ్, రషీద్ ధాటికి ఏడు బంతుల్లోనే ముంబై మూడు వికెట్లు కోల్పోయింది.

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన పొలార్డ్‌ బౌండరీలు బాదుతున్నప్పటికీ అతడికి సహచరుల నుంచి సహకారం లభించలేదు. ఒంటరి పోరాటం సాగింది. హైదరాబాద్‌ బౌలర్లు మంచి జోష్‌లో ఉండటంతో వరుస వికెట్లు తీస్తూ ఆ జట్టును దెబ్బ తీశారు.

కానీ, పొలార్డ్‌ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. నటరాజన్‌ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ మూడు, షాబాజ్‌, హోల్డర్ చెరో రెండు, రషీద్‌ ఒక వికెట్ తీశారు.