మరాఠాలకు రిజర్వేషన్లు.. బాంబే హైకోర్టు ఓకె… అయితే…!

మరాఠాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. ఇది సక్రమమేనని పేర్కొంది. అయితే.. ప్రభుత్వం ఆమోదించిన 16 శాతం రిజర్వేషన్లను కోర్టు తగ్గించింది. ఇది సమ్మతం కాదని అభిప్రాయపడింది. రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ సిఫారసుల ప్రకారం.. కోటా పర్శంటేజీని 12-13 శాతానికి తగ్గిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రంజిత్ మోరె, జస్టిస్ భారతీ డాంగ్రేలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రత్యేక కేటగిరీని, […]

మరాఠాలకు రిజర్వేషన్లు.. బాంబే హైకోర్టు ఓకె... అయితే...!
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 27, 2019 | 7:51 PM

మరాఠాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. ఇది సక్రమమేనని పేర్కొంది. అయితే.. ప్రభుత్వం ఆమోదించిన 16 శాతం రిజర్వేషన్లను కోర్టు తగ్గించింది. ఇది సమ్మతం కాదని అభిప్రాయపడింది. రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ సిఫారసుల ప్రకారం.. కోటా పర్శంటేజీని 12-13 శాతానికి తగ్గిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రంజిత్ మోరె, జస్టిస్ భారతీ డాంగ్రేలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రత్యేక కేటగిరీని, రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి శాసనపరమైన అధికారాలు ఉన్నాయని ఈ బెంచ్ పేర్కొంది. వీరికి 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు పిటిషనర్లు కోర్టుకెక్కారు. రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఇది ఉల్లంఘించేదిగా ఉందని వారన్నారు. మరాఠాలకు పదహారు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును రాష్ట్ర శాసన సభ గత ఏడాది నవంబరు 30 న ఆమోదించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం మీద 52 శాతం రిజర్వేషన్లు ఉండగా.. దానికి అదనంగా ఈ 16 శాతాన్ని చేర్చడంతో ఇది 68 శాతానికి పెరిగింది. పిటిషనర్లు ప్రధానంగా దీన్ని సవాలు చేశారు. కాగా-మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కొన్ని నెలలుగా మరాఠా ఆందోళన్ సమితి వంటి సంఘాలు పెద్దఎత్తున ఉద్యమించిన సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో వీరి ఆందోళన హింసాత్మకంగా కూడా మారింది.