విరిగిపడిన కొండచరియలు.. ముంబై టు గోవా రాకపోకలు బంద్..

Monsoon 2019, విరిగిపడిన కొండచరియలు.. ముంబై టు గోవా రాకపోకలు బంద్..

భారీ వర్షాలతో ముంబై నగరం తడిసి ముద్దయింది. గత పదిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. ముంబై-గోవా జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో.. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో అటు ఇటు వెళ్లేందుకు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్ ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాహనాపాల్ఘార్, రాయగడ్, పూణే, కొల్హాపూర్, సతారా జిల్లాల్లో ఆదివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *