ఒకే ఆస్పత్రిలో వందకి పైగా గర్భిణులు

కరోనా దెబ్బకి దేశం విలవిలాడుతోంది. దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ బాధితుల్లో అత్యధికంగా గర్భిణులకి పాజిటివ్ నిర్ధారణ అయింది ముంబైలోనే. 100 మందికి పైగా కరోనా తల్లులకి పురుడు పోసింది ముంబై మున్సిపల్‌ జనరల్‌ ఆస్పత్రి. దేశంలో అత్యధిక కరోనా కేసులను మూట కట్టుకుంది మహారాష్ట్ర. ఒక్క ముంబయిలోనే 24 వేల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 840 మంది ప్రాణాలు విడిచారు. కొవిడ్ 19 బాధితుల్లో వందలాది మంది గర్భిణులు ఉన్నది కూడా […]

ఒకే ఆస్పత్రిలో వందకి పైగా గర్భిణులు
Follow us

|

Updated on: May 21, 2020 | 8:34 PM

కరోనా దెబ్బకి దేశం విలవిలాడుతోంది. దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ బాధితుల్లో అత్యధికంగా గర్భిణులకి పాజిటివ్ నిర్ధారణ అయింది ముంబైలోనే. 100 మందికి పైగా కరోనా తల్లులకి పురుడు పోసింది ముంబై మున్సిపల్‌ జనరల్‌ ఆస్పత్రి. దేశంలో అత్యధిక కరోనా కేసులను మూట కట్టుకుంది మహారాష్ట్ర. ఒక్క ముంబయిలోనే 24 వేల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 840 మంది ప్రాణాలు విడిచారు. కొవిడ్ 19 బాధితుల్లో వందలాది మంది గర్భిణులు ఉన్నది కూడా ఇక్కడే. వారిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందించారు. అలాంటి గర్భిణుల్లో చాలా మందికి లోకమాన్య తిలక్‌ మున్సిపల్‌ జనరల్‌ ఆస్పత్రి వైద్య సిబ్బంది సుఖ ప్రసవం చేశారు. కొందరికి సీజేరియన్‌ కూడా జరిగింది. పుట్టబోయే పిల్లలకు కరోనా లేదని తేలడంతో వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. కరోనా సోకిన గర్భిణులు.. గత నెల రోజుల నుంచి 115 మంది పిల్లలకు జన్మనిచ్చారు. వీరిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది. కరోనా గర్భిణులకు పుట్టిన పిల్లల్లో 56 మంది మగ పిల్లలు కాగా 59 మంది ఆడబిడ్డలు. కరోనా సోకిన వారిలో ఇద్దరు గర్భిణులు మృతి చెందారు. ఈ గర్భిణులకు లోకమాన్య తిలక్‌ మున్సిపల్‌ జనరల్‌ ఆస్పత్రికి చెందిన 65 మంది డాక్టర్లు, సుమారు 24 మంది నర్సులు దగ్గరుండి వైద్య సేవలు అందించారు. ఆస్పత్రిలో 40 బెడ్ల వార్డులో వీరికి చికిత్స అందించారు. ప్రెగ్నెంట్‌ మహిళల కోసం అదనంగా 34 బెడ్లను అందుబాటులో ఉంచారు. కరోనా మహమ్మారిపై విజయం సాధించేందుక అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే గర్భిణుల్లో అధిక మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినప్పటికీ వారిలో ఆ లక్షణాలు కనిపించలేదన్నారు వైద్యులు. కొందరూ జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారన్నారు. గర్భిణులకు డెలివరీ జరిగిన తర్వాత వారిని ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో ఉంచామన్నారు వైద్యులు. కోలుకున్నవారిని వారి ఇళ్లల్లోనే క్వారంటైన్‌ చేశామన్నారు.