మల్టిలెవల్ మార్కెటింగ్ రాకెట్.. ఈబిజ్ ఎండీ, ఆయన కుమారుడు అరెస్ట్

Multi level marketing racket busted in Hyderabad, మల్టిలెవల్ మార్కెటింగ్ రాకెట్.. ఈబిజ్ ఎండీ, ఆయన కుమారుడు అరెస్ట్

హైదరాబాద్‌లో ఈబిజ్ పేరుతో మల్టి లెవల్ మార్కెటింగ్‌ చేపడుతున్న ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. ఈబిజ్ సంస్థ ఎండీ పవన్ మల్హన్, ఆయన కుమారుడు హితిక్ మల్హన్‌లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో చైన్ సిస్టమ్ ద్వారా ఈ బిజ్ మోసం చేసిందని కేపీహెచ్‌బీ, మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లలో పలు కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చైన్ సిస్టమ్ ద్వారా దేశవ్యాప్తంగా రూ.5 వేల కోట్ల మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీలో పవన్, హిటిక్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. న్యాయస్థానంలో నిందితులను హాజరుపర్చిన పోలీసులు.. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *