మోదీ కోసం కాలినడక చేస్తే… కాంగ్రెస్‌ టికెట్‌ దక్కింది

భువనేశ్వర్‌: జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో ఎప్పుడు ఎటువంటి పరిణామాలు జరుగుతాయో ఎవరూ చెప్పలేరు. రాత్రికి రాత్రే ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతుంటాయి. తాజాగా అటువంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది . ముక్తికాంత బిస్వాల్‌.. ఈ పేరు గుర్తుండే ఉంటుంది.  ప్రధాని మోదీ ఇచ్చిన హామీని గుర్తుచేసేందుకు 1500 కిలోమీటర్లు నడుచుకుంటూ ఢిల్లీ వెళ్లిన ఈ వ్యక్తి అప్పట్లో వార్తల్లో తెగ హల్‌చల్ చేశాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్‌తో ముక్తికాంత బిస్వాల్‌‌కి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. తాజాగా ఈయన […]

మోదీ కోసం కాలినడక చేస్తే... కాంగ్రెస్‌ టికెట్‌ దక్కింది
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 27, 2019 | 2:52 PM

భువనేశ్వర్‌: జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో ఎప్పుడు ఎటువంటి పరిణామాలు జరుగుతాయో ఎవరూ చెప్పలేరు. రాత్రికి రాత్రే ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతుంటాయి. తాజాగా అటువంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది . ముక్తికాంత బిస్వాల్‌.. ఈ పేరు గుర్తుండే ఉంటుంది.  ప్రధాని మోదీ ఇచ్చిన హామీని గుర్తుచేసేందుకు 1500 కిలోమీటర్లు నడుచుకుంటూ ఢిల్లీ వెళ్లిన ఈ వ్యక్తి అప్పట్లో వార్తల్లో తెగ హల్‌చల్ చేశాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్‌తో ముక్తికాంత బిస్వాల్‌‌కి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది.

తాజాగా ఈయన మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఒడిశాలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముక్తికాంతకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కేటాయించింది . రూర్కెలా శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరుపున ఈయన బరిలోకి దిగబోతున్నారు.

రూర్కెలా సమీపంలోని ఓ చిన్న గ్రామానికి చెందిన 31ఏళ్ల ముక్తికాంత బిస్వాల్‌ మోదీని కలిసేందుకు గతేడాది 71 రోజుల పాటు 1500 కిలోమీటర్లు కాలినడక వెళ్లారు.  తమ ప్రాంతంలో ఉన్న ఇస్పాత్‌ జనరల్‌ హాస్పిటల్‌లో మెరుగైన వైద్య వసతులు కల్పిస్తామని 2015లో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అయితే రెండేళ్లు గడిచినా.. మోదీ ఇచ్చిన హామీ అమలు కాలేదు. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆసుపత్రిలో రోగులు ప్రాణాలు కోల్పోతుండటంతో.. మోదీ ఇచ్చిన హామీని గుర్తు చేసేందుకు ముక్తికాంత ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే అనేక కష్ట, నష్టాలకు ఓర్చి ఢిల్లీ చేరుకున్నప్పటికీ  ముక్తికాంత బిస్వాల్‌ ప్రధాని మోదీని కలుసుకోలేకపోయారు.