జనసేన మాస్టర్ ప్లాన్.. ‘ఆయన్ను’ పార్టీలోకి చేర్చుకుంటున్నారా..!

Lakshmi Narayana meets Mudragada, జనసేన మాస్టర్ ప్లాన్.. ‘ఆయన్ను’ పార్టీలోకి చేర్చుకుంటున్నారా..!

అధికార, విపక్షాల విమర్శలు.. రాజకీయ వలసలతో ఏపీ పాలిటిక్స్ హాట్‌హాట్‌గా మారాయి. ఇలాంటి నేపథ్యంలోనే శుక్రవారం ఏపీ పాలిటిక్స్‌లో మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. జనసేన పార్టీ నేత, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ.. కాపు నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. ముద్రగడ ఇంటికి వెళ్లిన జేడీకి సాదర స్వాగతం లభించిందట. అంతేకాదు జేడీకి స్వయంగా టిఫిన్ వడ్డించిన ముద్రగడ.. ఆ తరువాత గంటకు పైగా చర్చలు జరిపారట. అయితే ఉన్నట్లుండి వీరిద్దరు భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీసింది.

Lakshmi Narayana meets Mudragada, జనసేన మాస్టర్ ప్లాన్.. ‘ఆయన్ను’ పార్టీలోకి చేర్చుకుంటున్నారా..!

కాపు నేతగా మంచి పేరొందిన ముద్రగడ గత కొన్ని సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు. అయితే ఈ రిజర్వేషన్లపై గత చంద్రబాబు విఫలమవ్వగా.. ఇటీవల అధికారంలోకి వచ్చిన జగన్ ఏ హామీని ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు జనసేనలో చేరి.. బీసీ రిజర్వేషన్లపై పోరాటం ముమ్మరం చేయాలని ఆయన అనుకుంటున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు త్వరలో తాను ఓ పార్టీకి మద్దతు పలుకుతానని ముద్రగడ ఇటీవల ఓ ప్రకటన ఇచ్చారు. ఇక ఆ మద్దతు జనసేనకే అని తెలుస్తోంది. దానిపై మాట్లాడేందుకే జేడీ, ముద్రగడ తాజాగా కలిశారని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

మరోవైపు ఏపీలోని కాపు నేతలను ఆకర్షించేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే పార్టీలోని సీనియర్లు కాదని ఆ సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించారు. ఈ క్రమంలో ఇప్పుడు ముద్రగడను కూడా తమ పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ నేతలు భావిస్తున్నారట. అందులో భాగంగా ఆ పార్టీకి చెందిన కొంతమంది ఇటీవల ఆయనను కలిశారని.. బీసీ రిజర్వేషన్లపై ఆయనకు వారు హామీ ఇచ్చారని.. దీంతో బీజేపీలో చేరేందుకు ముద్రగడ కూడా సానుకూలంగా ఉన్నారని ఆ మధ్యన పుకార్లు గుప్పుమన్నాయి. దానిపై ఇంతవరకు స్పష్టత రాకపోగా.. ఇప్పుడు జేడీతో ముద్రగడ భేటీ అవ్వడంతో.. అసలు ఆయన మనసులో ఏముంది..? ముద్రగడ రాజకీయ భవితవ్యం ఏంటన్న చర్చ విశ్లేషకుల మధ్య జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *